| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 10. తలుపు దగ్గర పాట |
|
శ్రీకాంతామణి నే నీ సఖుడను శీఘ్రము వాకిలి తీవే నీవు శీఘ్రము వాకిలి తీవే. ఓ కాంతుడ నీగుణములు తెలిసెను ఊరికె వెళ్ళగదోయీ నీవు ఊరికె వెళ్లగదోయీ. ఈ మాటలు నీవెన్నడాడవైతి ఏమే అలుమెలుమంగా అది ఏమే అలుమేలుమంగా., భామలమరగిన వాడవు నాతో పలుకులేలసో - పోయీ - యీ పలుకులేల పోవోయీ. పరభామలనే కూడితినని యిటు పలుకుట కారణమేమే సఖి పలుకుట కారణమేమే. తరుణులకూడక యుంటే పువ్వుల దండలు ఎక్కడివోయీ పూల దండలు ఎక్కడివోయీ. హరిహరి నేనేమెరుగను - భక్తులు అర్పించిరె వో చెలియా - నా కర్పించిరె వో చెలియా. |