| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 14. వరికోత పాట |
|
జంబైలోలే - జోతులంగరు. అన్నాలారా - తమ్మూలారా జంబైలోలే - జోతులంగరు. జోరీగుళ్ళా యీదీలోనూ జోరూచేసీ పలకారన్నా మిద్దీమీదా - మిరపాచెట్లూ నీళ్ళులేకా - జోగీపోయే అంతరాలు - పడవామీదా అందీపూలూ - కోయాబోతే రాలీపూవూ - రంగామెల్లి రంగామంతా భంగాపుచ్చే మంచినీళ్ళ - బావీకాడ పుట్టామీద - పాలా పిట్ట కొట్టాబోతే - తేలూకుట్టె బావాగారు మంతారించె భల్లూ భల్లూ తెల్లా వారె ఎఱ్ఱ చెరువూ గట్లామీద ఎడ్లామేపే - చిన్నవాడా ఎడ్లాకేసే - పోలీకేక నాకుయేస్తే నేనూరాను. |