| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 30. శ్రీరాములవారి తొట్టె |
|
శ్రీ వెలయు అయోధ్యలో దశరధులు చెలగి వేడుకనుండగా ఆ వనజనాభులపుడూ భూమిలో అవతరింపుచు నుందురు పుత్రకామేష్టి వేల్వ ఆ రాజపుత్రులను కోరగానూ పాత్రతో పరమాన్నమూ తెచ్చి ఆ పరమపురుషులకిచ్చిరీ పరమాన్న మపుడు తెచ్చీ ఆ రాజు పడతులకు యివ్వగానూ సరగునా గర్భమునను ఉదయించి సంతోషమున యుండిరీ ఆరునెలలాయెననుచూ కౌసల్యకపుడు శ్రీమంతమునకు ఆరూఢిగా చేయరే వశిష్టాదులందరూ దీవించిరీ దశమమాసము వచ్చినా కౌసల్య ప్రసవసమయ మందునా కుశలముగ ముగ్గురికినీ సుఖముగా సుతులు నలుగురు కలిగిరి అప్పుడా రాజుతోనూ ఈ వార్త చెప్పినా విన్నగానే ఒప్పయిన వస్త్రములనూ బహుమాన మిప్పించి వుప్పొంగెనూ రంగైన రత్నాలనూ చెక్కించి బంగారు తొట్టెలకునూ అంగనా మంచలా కొరకూ దశరధులు అతివేడ్క నంపించిరీ ఆణిముత్యపు చేరులూ తొట్టెపై అనుమాన గిరికికట్టీ పొలుపైన పూలసొరులూ తొట్టెపై పూలు సింగారించిరీ కనులగాటుక దీర్చెనూ రాములకు కడువేడ్కతో కౌసల్య దిష్టిచుక్క మరిపెట్టీ రాములకు జగమెల్ల వెలుగుగాను పసుపుకుంకం పువ్వులూ మేలైన పన్నీరు గంధములనూ పసిడి తబుకుల వుంచుకో సుమిత్ర సుభతులకు తాయిచ్చెనూ పట్నీలు భాగాలనూ మేలైన పండు టెంకాయలూను పసిడి తబుకులవుంచుకో సుమిత్ర సుభతులకు తాయిచ్చెనూ నూరు గరిసెల సెనగలూ నీళ్ళలో నానబోయించి తెచ్చి వారిజాక్షులకు నెల్ల కౌసల్య వాయనాలిప్పించెనూ ముడ్డిక్రిందా సెనగలూ కౌసల్య గొడ్రాళ్ళకిప్పించెనూ కోరి కొడుకుల కనమనీ కౌసల్య గొడ్రాళ్ళ దీవించెనూ ఊచుమని యింతులూచ పాడుమని పరమ భాగవతులార ఆడమని రంభలార ఊయాలలూగుమా రంగశాయీ సత్యస్వరూపుడమ్మా ఈబిడ్డ అచ్యుతానంతుడమ్మా అత్యంత సుకుమారుడే ఆబిడ్డ ఆదినాయుడండ్రు వటపత్ర శాయనూడమ్మా ఈ బిడ్డ వైకుంఠపురివాసుడూ పూర్ణంపు చంద్రుడమ్మా ఈ బిడ్డని పురుషోత్తముడందురూ కరుణాకటాక్షుడమ్మా ఈ బిడ్డ కంసునికి వైరి యితడూ కుటిలకుంతల చూడరే దశరధులకోర్కె లీడేరెనమ్మా చద్దులాడుచు కొందరూ తమతమా సుఖములను తెల్పుకొనుచూ నిద్దరని ఉల్కిపడుచూ ఉల్కిపడి పొద్దుపోయెననుకొందురూ అప్పుడా దోవలోనూ సెనగలూ ఒప్పుగా నమిలి చూసి ఉప్పులేదనుచు వనిత మరివనిత చప్పగా వున్నదనుచూ శ్రీరామ నామంబులూ ఎవరైన జపముచేసిన చాలునూ వారలకు భయమేటికే వైకుంఠవాసులై తమరుందురూ శ్రీరామ తొట్టె యిపుడూ ఎవరైన పాడినా విన్నగానీ సకల సంపదలు కలిగీ సౌభాగ్య పదవితో తమరుందురూ. |