| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 36. ఊడుపు పాట |
|
దండా దగ దగ లాడి కుచ్చూ నిగ నిగ లాడి దండా నీ కెవరేశారూ కొండమ్మ బుల్లీ దండా నీ కెవరేశారూ? మేనత్త కొడుకమ్మ ముద్దూల బావయ్య దండా నందియ్య వేశారూ కొండమ్మ బుల్లీ దండా నందియ్య వేశారూ. వారుచేసే దమ్ములాకు మనమూడ్చే ఊడ్పులాకు బలే గమ్మత్తు గున్నాదిలే కొండమ్మ బుల్లీ బలే గమ్మత్తు గున్నాదిలే వాడి పళ్ళే పకోడీలు వాడి ముఖమే దుకాణం బలే గమ్మత్తు గున్నాదిలే కొండమ్మ బుల్లీ బలే గమ్మత్తు గున్నాదిలే |