| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 41. ఓరి మొగడా |
|
ఓరి మొగడా ఒయ్యారి మొగడా నాయేలి పడ్డ పాటుచూడు ॥ఓరి మొగడా॥ నీవు దయగాల మొగుడవైతే ॥ఓరి మొగడా॥ నేను చిత్రమయిన చీర గట్టి ॥ఓరి మొగడా॥ నేను రత్నమయిన రయికతొడిగి ॥ఓరి మొగడా॥ కాటు కెట్టుకు కమతలాగున్నాను ॥ఓరి మొగడా॥ బొట్టెట్టుకు బొమ్మలాగున్నాను ॥ఓరి మొగడా॥ నే గజ్జిలా కొడవలుచ్చుకుని ॥ఓరి మొగడా॥ నే గుంటూరి చేలోకి ॥ఓరి మొగడా॥ నే వరికోత కెళ్ళాను ॥ఓరి మొగడా॥ నన్నెండ్రకాయ కరచింది ॥ఓరి మొగడా॥ నీవు ప్రేమగలా మొగుడవైతే ॥ఓరి మొగడా॥ నీవు డాటరు మందెయ్యించు ॥ఓరి మొగడా॥ నీవు ప్రేమగాలా మొగుడవైతే ॥ఓరి మొగడా॥ సరసమైనా మొగుడవైతే ॥ఓరి మొగడా॥ నాకు సంధి మంత్రమేయించు ॥ఓరి మొగడా॥ ఓరి మొగడా ఒయ్యారి మొగడా నా యేలి పడ్డ పాటుచూడు ॥ఓరి మొగడా॥ |