| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 49. రోడ్డు వేస్తూ పాడే పాట |
|
జోరులో జొన్నాడ దాటి బారులో బందారు దాటి ఓ లాగరా లాగార నాయన ఓ నిమ్మ చెట్టుకి నిచ్చెనేసి నిమ్మపళ్ళు కొయ్యబోతే నిమ్మముల్లు రొమ్మునాటె ఓ చీరులొల్ల చిత్తకల్లు రయికలొల్ల రత్తగుల్ల ఓ అన్నలారా, తమ్ములార ఓ అందమైనా శూరులార. |