| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 58. కోత పాట |
|
రోడ్డోర కోతకీ రానే పిన్నమ్మా... సయిజ లెక్కొస్తారు రానే పిన్నమ్మా... చూస్తారు పిన్నమ్మా రానే పిన్నమ్మా... కారుమీదొస్తారు రానే పిన్నమ్మా... కసురుకుంటొస్తారు రానే పిన్నమ్మా... గాజులన్ని చిట్లుతాయి రానే పిన్నమ్మా... కోకంత నలుగుతాది రానే పిన్నమ్మా... పాపిడంత చెరుగుతాది రానే పిన్నమ్మా... సరసోళ్లు సూతారు రానే పిన్నమ్మా... చూస్తారు పిన్నమ్మ రానే పిన్నమ్మా... చేతులన్ని కందుతాయి రానే పిన్నమ్మా... |