| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 60. దంపు పాట |
|
ఏపా చెట్టూకాడ నాబొమ్మరిల్లూ కూకోర అన్నయ్య కూడొండుతాను కూకోర అన్నయ్య కూడొండుతాను కూటీకి కాదప్ప కూతురి కొచ్చానూ కూటీకి కాదప్ప కూతురి కొచ్చానూ కూతురు చిన్నాది కులమూగొప్పాదీ కూతురు చిన్నాది కులమూగొప్పాదీ అల్లూడు పెద్దోడు వేసిగలోడూ అల్లూడు పెద్దోడు వేసిగలోడూ ఓలేమి యిత్తారు ఓ పెద్దలార ఓలేమి యిత్తారు ఓ పెద్దలార అరుగుమీదరవయ్యి ఓలుముప్పయ్యి ఏపా చెట్టూకాడ నాబొమ్మరిల్లూ కూకోర అన్నయ్య కూడొండుతాను |