| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 62. దంపు పాట |
|
సురతాడి మావొదిన సూదూ లమ్మిందీ సూదూలమ్మిన గింజ గాదీ కట్టిందీ సువ్వి - హా - సువ్వి. వీపరాలు మావొదిన విందట్టు కొస్తే నల్లేరు నలుగెడుదు కంద నీళ్ళోస్తూ సువ్వి - హా - సువ్వి. పండినది వొదినా వలపూలతో మాగింది ఒదినా మామిడి పండల్లె సువ్వి - హా - సువ్వి. |