| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 64. సిరిసిరిమువ్వ |
|
బావల్లు వచ్చారు సిరిసిరి మువ్వ భాగ్యాలు తెచ్చారు సిరిసిరి మువ్వ బీడుల్లు దున్నారు సిరిసిరి మువ్వ మోటల్లు తోడారు సిరిసిరి మువ్వ విత్తుల్లు జల్లారు సిరిసిరి మువ్వ పచ్చగ చేలన్ని సిరిసిరి మువ్వ పండీ వొరిగున్నాయి సిరిసిరి మువ్వ పంటల్లు కోశారు సిరిసిరి మువ్వ మూటల్లు కట్టారు సిరిసిరి మువ్వ బళ్ళకు ఎత్తేరు సిరిసిరి మువ్వ గలగల ఆ బళ్లు సిరిసిరి మువ్వ గడప ముందాగాయి సిరిసిరి మువ్వ ధాన్యాల మూటల్లు సిరిసిరి మువ్వ గాదూల నింపారు సిరిసిరి మువ్వ పంటాలా పండూగ సిరిసిరి మువ్వ భాగ్యాల పండూగ సిరిసిరి మువ్వ పుట్టింటి పడచులకు సిరిసిరి మువ్వ పుట్టిందా పండూగ సిరిసిరి మువ్వ డూడూడూ బసవన్న సిరిసిరి మువ్వ మనపల్లె కొస్తాడు సిరిసిరి మువ్వ బావల్లు వచ్చారు సిరిసిరి మువ్వ భాగ్యాలు తెచ్చారు సిరిసిరి మువ్వ |