| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 74. కోల వేసే పాట |
|
సరసపతిరా సాయమొచ్చి అయిలేసా వో బేలిసా అదిమానాకన్నా తల్లె అయిలేసా వో బేలిసా కన్న తల్లికే యిరుకెరా అయిలేసా వో బేలిసా మొగంనిండరా కోపం తెచ్చి అయిలేసా వో బేలిసా జోరుచేసి రాపటండి బాబు అయిలేసా వో బేలిసా పడుచువోళ్లురా మీరు అయిలేసా వో బేలిసా పట్టు తెగితేరా అయిలేసా వో బేలిసా కొత్త తాడూ వేశేద్దాము అయిలేసా వో బేలిసా అయిలేసా వో బేలిసా. |