| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 98. వీడ్కోలు |
|
మాయమ్మ లక్షిందేవి పోయి రావమ్మా... పోయి నీ అత్తింట బుద్ధి గలిగుండు ఎవ్వరే మాడిన ఎదురాడకమ్మ వీధి నిలుచుండీ తల విప్పీ ముడువకుమీ మాట లెన్నన్నాను మాటాడకమ్మ పలుమారు మామీద ప్రేమలుంచకుమా ఆకలున్నాగాని అని అడగబోకు మాటాకి పదహారు నాటకు డతను అతని కాదనీ పూలు ముడువ బోకమ్మ... బొమ్మరిల్లున్నాయి బొమ్మలున్నాయి నేనూ ఆడేటి సాలా లున్నాయి నా మారుగా మీరు ఆడుకోరమ్మా పోయి నా అత్తింటికి పోయి వస్తాను దీయించు అన్నల్లు దీయించు అక్కా మాయమ్మ లక్షిందేవి పోయిరావమ్మా... |