| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
100. రాజ నిమ్మపండు
| ఇంకా మచ్చు పాటలే పాడుతున్నాడు. అసలు పాట 'రాజ నిమ్మ పండు'. డోలక్ వాయించేవాడు చిరుకట్టెతో తాళము నిలుపుతూ వాయిస్తాడు. అదుగో అదే - |
| పల్లవి:- | రాజన్న రాజో! నా రాజ నిమ్మలపండో! ఓడెల్తుందో డెల్తుంది । నా రాచ ముద్దుల బావ । | |
| అ। ప।:- | రాజ, నా రాజ, నా రాజ నిమ్మలపండ; నా అప్పరావు కొండ; నాలేత మామిడి మొగ్గ; నా అప్పుడు గాచిన నెయ్యి । నానేతిలో ఉడికిన బూరికన్న। నేరుపైన రాజా! ఓడెల్తుందో డెల్తుంది; నారాజ దేశమెల్లి పోతున్నావా | ॥రా॥ |
| 1 చ:- | వెళ్ళేవాడ వెళతావు! ఎన్నాళ్ళకు వస్తావో? ఇంటి వెనుకల, ఆకుమడి దున్నెల్లు రాజా! వచ్చిందాక; చూచుకుంటాను | ॥రా॥ |
| 2 చ:- | వెళ్ళేవాడ వెళతావు! ఎన్నాళ్ళకు వస్తావో? ఎడమకాలి మడమతోటి; తన్నెల్లు రాజా! వచ్చినదాక; చెప్పుకుంటాను | ॥రా॥ |
| 3 చ:- | వెళ్ళేవాడ వెళతావు! రంగంలో దిగుతావు; ఒకటో నెంబరు గళ్ళీ; చల; రెండో నెంబరు గళ్ళీ; చల; మూడో నెంబరు గళ్ళీ; కెళితే మళ్ళిరావు రాజో | ॥రా॥ |
| 4 చ:- | దేశము బాగుందా? ఊరైన బాగుందా? అనుచు, అడిగి పిలిపించి। ఆదరణ చేయించి; ఉడుకు నీళ్ళు త్రాగబెట్టి। వేపరొట్టె చేతికిచ్చి! అంతమంది తొలగి । అట్టే పోవు రాజో | ॥రా॥ |
| ఇది వాస్తవానికి ఓడ పాట. నమ్మించిన ప్రియుడు రంగం పోతూన్నప్పుడు పాటకపు ప్రియురాలి గుండె పాడుకొను పాట ఇది. |