| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (మారాం చేస్తున్నాడు పిల్లాడు. ఊరుకోబెడుతూంది - తల్లి - లాలితో) |
| 003. లాలి పాట |
|
లాలీ లాలమ్మా లాలీ లాలమ్మా లాలీ - లాలమ్మ లాలి లాలమ్మ గుఱ్ఱాలు లంకల్లో మేసే - లంకల్లో మేసే బుల్లెమ్మ గుఱ్ఱాలు బీడుల్లో మేసే - బీడుల్లో మేసే అప్పన్న గుఱ్ఱాలు అడవుల్లో మేసే - అడవుల్లో మేసే ... ఊరుకో అబ్బాయి వెఱ్ఱీ అబ్బాయీ - వెఱ్ఱీ అబ్బాయీ ఉగ్గెట్టు మీయమ్మ ఊరుకెళ్ళిందీ - ఊరుకెళ్ళిందీ పాలిచ్చు మీయమ్మ పట్టామెళ్లిందీ - పట్టామెళ్ళిందీ నీలోసె మీయమ్మ నీలకెళ్ళిందీ - నీలకెళ్ళిందీ ... |