| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (శివ - పార్వతుల మధ్య సాగే సంవాదం) |
| 009. తలుపు దగ్గర పాట |
|
శివభక్తులకే దయగలవాడను శివుడందురు నా పేరూ - సాంబ శివుడందురు నా పేరూ. శివనామంబులు సకలెందుల కెల్లును చేరికతో వుండవోయీ - శివ చేరికతో వుండవోయీ. వడిగినలందిన కుంతన లొసగెటి ఉరపతి ధరుడనె గౌరీ - నే ఉరపతి ధరుడనె గౌరీ. ఉరపతి ధరుడవైతే యేలాయెను వడలు కడకు పోవోయీ - శివ వడలు కడకు పోవోయీ. బలాన రాముడు బలసతి నడిగిన బలిదుండుడనే గౌరీ - నే బలిదుండుడనే గౌరీ. బలి దుండుడవైతే యేలాయెను భక్తులిళ్ళకు పోవోయీ - శివ భక్తులిళ్ళకు పోవోయీ. కొమరుగ గంగని జటలో నించుకు కొమర జంగాన్నే గౌరీ - నే కొమర జంగాన్నే గౌరీ. కొమర జంగమైతే మాయెను కొమరు లిండ్లకు పోవోయీ - శివ కొమరు లిండ్లకు పోవోయీ. కాశీలోపల మోక్షము లొసగెటి గంగాధరుడనె గౌరీ - నే గంగాధరుడనె గౌరీ. వాశికి యేలాగైతిరిగే మిరు వార్నాశివైవుండవోయీ - శివ వార్నాశివై వుండవోయీ ... |