| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (బంతులాటలు అంటే - పెళ్ళికొడుకునీ, పెళ్ళికూతురునీ కూర్చోబెట్టి - పూవులు బంతులుగా కట్టి ఆడిస్తారు - ఆ సమయంలో పాడేవే బంతులాటల పాటలు) |
| 026. బంతుల పాట |
|
బంతులాడగరావే పార్వతీ చెంతనొందియ్య లేనేకోమలి పంతాము మాని నా చెంతానూ చేరావే యింతీ పూలాబంతీ ... రాజముఖి బంతి రాజూడు తేజామలరీనా విరులాచే సతినేడు కుంజరయాన నీ చెంగటకువచ్చె భామినీ హంసగామినీ ... కర్పూరగంధిరో వేగామే కాంతాలమర్చినా చెండు చూడిమి నేర్పుతో వేసేద బంతిని బట్టిమిచాలా రవ్వ ఏలా ... చెండూ నందుకో యిదె భామినీ చెండీ సదమలగుణవతి కామినీ బొడ్డూమల్లేపూల చెండూ వచ్చేనూ యిదిగోనారీ సుకుమారీ ... |