| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (భూపాళరాగంలో పెళ్ళివారి బండిలో శరద్రాత్రి ప్రయాణంలాగా సాగే భక్తిపూరితమైన సీతమ్మ మేలుకొలుపు) |
| 030. మేలుకొలుపు |
|
అమ్మా సీతమ్మ మాయమ్మ ముద్దులా గుమ్మ అమ్మ బంగారు బొమ్మ లెమ్మ అమ్మా॥ అమ్మరో యిమ్ముగ అరుణో దయంబాయే అమ్మలా కన్నమ్మ లెమ్మ అమ్మా॥ భక్తులందరు లేచీ ప్రార్థించుచున్నారు భక్తాపరాధీన లెమ్మ అమ్మా॥ భక్తా శిఖా మణి పావని అరుదెంచే ముక్తిప్రదాయినీ లెమ్మ అమ్మా॥ బ్రహ్మాండ మలరంగ బ్రహ్మాది సురులెల్ల ప్రార్థింపు చున్నారు లెమ్మ అమ్మా॥ బ్రహ్మ రుద్రాదులు ప్రస్తూతి సేశాగ బ్రహ్మస్వరూపిణి లెమ్మ అమ్మా॥ |