| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (లక్ష్మీ- నరసింహస్వాముల మధ్య సాగే సంవాదం) |
| 032. లక్ష్మీ -నరసింహస్వామి సంవాదం |
|
తరుణీ నేనూ రాగాజూచీ తలుపులూ మూసున్నావిధమూ అరదుగా నీ మదికీ తోచేనా? ఓ లక్ష్మీదేవీ అతివ నీకూ అలుకా ఏలానే? గాయకుడా నీవాగాలూ కానావచ్చే నీతీలాలలూ నేడు మాయసుద్దూ లెన్నా డేవోయీ ఓ నారసింహా మమ్మురవ్వలేలా చేశావు? దుష్టా విగ్యాహామూతోనూ దోరూకోనీ వేటాడితే దుష్టనిగ్రాహమే ఆయెనే ఓ లక్ష్మీదేవీ సృష్టిపాలింపగనే వస్తీనే వేటాబోయేననుచు పోయి నీటుమీరా నీవందూయే బోటూలాకూడకూ వస్తినీ ఓ నారసింహా బొంకులూ నాతోడి బొంకేవూ కామూకో నీరాజువేటా లాడేబో యే నాచోటానే భామాముఖము నేనెరుగానే ఓ లక్ష్మీదేవి పడగ వేటాలాడేవస్తీ నే పొద్దూరెండూ జాములాయే నిద్రపోయేటి వేళాలో సద్దూచేయా వచ్చీనావూరా ఓనారసింహా బుద్దులెట్లూ నీకూతోచెరా కోమాలాంగీ శ్రీ గరుడాద్రీ శ్రీ నారసింహుండనే నేనూ కోరినిన్నూ కూడా వస్తీనే ఓ లక్ష్మీదేవీ చేరనిచ్చి తలుపూ తియ్యావే అందామలరా నీ వెందెందూ ఏ సుందరుల నెరుగా ననుచూ గంధమేలా కలిగేరాజాణా ఓ నారసింహా కల్కి ఎవతో నీకూపూసేరా తప్పాడ పొదలాలోనూ తరచూ వేటలాడాబోతే పుప్పొడే నామీదారాలేనే ఓ లక్ష్మీదేవీ పూసినట్లే గంధమాయెనే సద్దూలు పల్కేవు చాలా పరమాత్మపైయింగారూచాలు వాసంతమేలా కలిగేరాజాణా ఓ నారసింహా వనితయెవతో నీకే పూసేరా పూచినాముదూలా తరులా పూలసరులా శృంగారములూ చూసివస్తామనుచూ పోతేనే ఓ లక్ష్మీదేవీ సొంపొతేటే రసమూ చిందేనే ప్రాకటముగా చెంచూవనితా భామాకూడీనా వాకిటా నాకు దత్తామియ్యారా స్వామీ ఓ నారసింహా వాకిలీ నే తీసేను గానీ తరుణీ నేనూ శ్రీరూపము దాల్చియున్నావాడినికనుకా అరదుగా నీమదికే తోచేనే ఓ లక్ష్మీదేవీ అతివనీవూ అలుకామానావే పద్దూలుపల్కేవూ చాలా పరమాత్మా మీ వద్దనున్నా ముద్దుగుమ్మ ఎవతే రా జాణా ఓ నారసింహా మొరసి మొరసి నిన్నేచూసేరా సన్నుతాంగీ నీవిప్పుడూ సఖియలా గుర్తెరుగా ననచు నిన్ను ముట్టి భాషాచేసేనా ఓ లక్ష్మీదేవీ నీమమతాలీ నేనెరుగానే వాసుదేవా మీరూ నాతో భాషాలూ చేసేదానంటే వాసువాదులెల్లా నమ్మరూ ఓనారసింహా దాసులైనావారూ నవ్వేరూ భాసురామ రామాగుణమా భాషాలూ చేసెదా మంటే వారు మమ్మెందుకు నమ్మరే ఓ లక్ష్మీదేవీ వారు మమ్మెందుకు నమ్మరే కంజనాభా మీరూ నాతో ఘమకించీ మాటాలాడేరూ ముంజేతి కంకణమే మెరసేరా ఓ నారసింహా మరచిచూడా అద్దమేలరా గజరాజసింహములా నేనూ ఘనమూగనే వేటాడితే సురలు నాకు మురియూచూనిపుడు ఓ లక్ష్మీదేవి సొంపుతో కంకణముకట్టారే సారసాక్షా నీవందూయా సఖియానీ గూడీయుండాకా సన్నిధికే ఎలావస్తీరా ఓ నారసింహా సరసమూ నీతో ఏలరా? అండాజాగమన నా దండీతప్పూలాకూ ఒక్క దండము నీకూ నే పెట్టేనే ఓ లక్ష్మీదేవి దండమూ నేరామూ మమ్మేలూ చిత్తాజాజాణా చెన్నూమీరగా నీ నిత్య కొత్తపెళ్లికొడుకై వుండరా ఓ నారసింహా కోరిపుత్రులనూ ఎత్తారా. |