| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (సీతను అప్పగింత పెడుతున్నాడు) |
| 034. అప్పగింతల పాట |
|
పూజితమగుచున్న బూజమ్ముబంతి భోజనాలందారూ పొందూగా జేసీ దశరథులు తమరంత కడు సంబ్రా పడుచు జనకునకు చెప్పేనే సీతా పయనమ్మూ. అంతలో జనకుండు సీతనూ తెచ్చీ కంద ఒడికట్టి యో బొమ్మ ఒడి కట్టీ తెల్లన్ని ముత్యాలూ దేవికీ కట్టీ నెయ్యి కాచనేరదూ నెలత సుమి ఒదినా నేర్పుగా జెప్పూ సీతా మీదమ్మా పాలు గాచనేరదూ పడతిసుమి ఒదినా భాగ్యములు నీవేనే బాగుగా చూడు బుద్ధులెరుగదు మంకు బుద్ధులే గానీ బుద్ధి ఒచ్చినదాక దిద్దుకోవమ్మా పాలలో చెయిముంచి భూమిసుత తెచ్చీ కౌసల్య చేతూలో చెయి వప్పాగించే శ్రీరాములూ సీతా పయనమయి రాగా మేలు శకునములాయె వాడా లోపలానూ కోటివేలా దివిటీలూ కొమరప్ప వెలుగా కొమరుడీ గృహా ప్రవేశంబులాయే వేవేల దివిటీలు వేడుకతో వెలుగా రాముడీ గృహా ప్రవేశంబులాయే |