| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 041. పుట్టిల్లు |
|
పిండికొడదా మక్కా బండెక్కుదామా. రామగిరి వెడదామ రావె చెల్లాలా. రామగిరి పట్టాన మనకెవ్వ రక్కా. మన అమ్మ-తమ్ములే మనకు మామల్లు. మేడచుట్టూ రెండు మేటి స్థంభాలు. మేనమామ దివాణం నే పుట్టినిల్లు. దొడ్డిచుట్టూ రెండు దిడ్డి గంపల్లు. దొడ్డవారి దివాణం అమ్మ పుట్టిల్లు. |