| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (ఇటువంటి 'లాలి'పాటలకు పెద్దవారైనా హాయిగా నిద్రపోతారు) |
| 049. లాలి పాట |
|
లాలి శ్రీజనలోల లీలా వినోదా లాలి ద్వారకపురి బాలగోపాలా తొలుత బ్రహ్మాండంబు తొట్టెగా వేసి నాలుగూ వేదములు గొలుసులమరించీ బలువైన ఫణిరాజు పాన్పులమరించీ చిత్తమనియేటి దూలములు వేసి అందముగ జాంబవతి చందనము పుయ్య పొందుగా కాళింది పూవులందియ్యా మందయానము రాధ మనపు లందియ్యా ఇందుముఖి లక్షణా వింజామరెయ్యా చుట్టుగోప స్త్రీలు తొట్టె నూచంగా కోట రంగారాజు కోర్కెలొసగంగా |