| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (నిన్నటి కోడలు - నేటి కోడలిని పనుల్లో - పరీక్షించి - నిలదీసి - అడుగుతూంది - అత్తగారి కారం పాట అటువంటిది - తవ్వెడు బియ్యంతో ఓ పాతికమందికి పిండివంట చెయ్యాలట - విచిత్రంగా లేదూ) |
| 071. అత్తా కోడళ్లు |
|
పండుగా వచ్చింది ఓ అత్తగారా పండుక్కి బియ్యము ఎన్నిపోసేది వెయ్యవే నిచ్చినా తియ్యవే గాదీ పొయ్యవే తలగీచి తవ్వేడు బియ్యం ఆ బియ్యం నానేసి పిండిగా దంచి పిండి వంటలు చేసి అరసెల్లు వండు ఇరుగు పొరుగూ వారి కింతంత పెట్టు ఇంట్లోని పిల్లలకు కసరకా పెట్టు మాపటికీ మామకు మారు మూతెట్టు మరునాటి చల్దులకు మరుదులకు పెట్టు మనయింటి పాలేర్లు మురియంగ పెట్టు మనయింటి మరదలకు మనసుతో పెట్టు. |