| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (ఇటువంటి పాటలు - పాతవిషయానికి అద్దంలాటివి - ఆ కాలంలో దొంగలకి నిలయం కాబోసును తుంగభద్ర) |
| 073. రతనాల పేరు |
|
సీతమ్మ నీ చిన్న ప్రాయంపునాడు రాముడు రత్నాల పేరంపినాడు పేరుతో పెట్టెడు సొమ్మంపినాడు సొమ్ములు శోభిల్లు పసుపంపినాడు పసుపుతో పాలేటి నీళ్ళంపినాడు నీళ్ళకు నిమ్మల బావంపినాడు బావికి బంగారు మెట్లంపినాడు మెట్లకు వెయ్యంగ చెట్లంపినాడు చెట్లకు చేమంతి పూలంపినాడు తుంగ భద్రవద్ద దొంగలున్నారు దాచుకో సీతమ్మ రత్నాలపేరు దాచుకోకుంటేను దోచుకుంటారు |