| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (అప్పగింత: ఆ మాటలోనే ఏదో బాధ - బాంధవ్యం - బాధ్యత ప్రతిధ్వనిస్తుంది - అంతదాక పెంచిన పిల్లల మరో అయ్య చేతిలో పెట్టడం మాటలా చెప్పండి) |
| 087. వీడ్కోలు |
|
మాయమ్మ లక్ష్మీందేవి పోయి రావమ్మా పోయి నీ అత్తింట బుద్ధి గలిగుండు ఎవ్వరే మాడిన ఎదురాడకమ్మ వీధి నిలుచుండీ తల విప్పే ముడువకుమీ మాట లెన్నన్నాను మాటాడకమ్మ పలుమారు మా మీద ప్రేమలుంచకుమా ఆకలున్నా గాని అని అడుగబోకు మాటాకీ పదహారు నాటకు డతను అతని కాదనీ పూలు ముడవ బోకమ్మ బొమ్మరిల్లున్నాయి బొమ్మలున్నాయి నేను ఆడేటి సాలా లున్నాయి నామారుగా మీరు ఆడు కోరమ్మా పోయి నా అత్తింటికి పోయీ వస్తాను దీయించు అన్నల్లు దీయించు అక్కా మాయమ్మ లక్ష్మిందేవి పోయీ రావమ్మా. |