| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 095. దంపుడు పాట |
|
అరచేతిలో వడ్లేసి మోకజేయి దంపు ఏమన్న ఎరుగుదురా ఎయ్యేసి తోటికోళ్ల తియ్యేసి పోటు తోటికోళ్ల పోటు తోసెయ్యి పోటు బావగా రొస్తున్నారు బాగెయ్యె పోటు రెండిళ్ల సందూన పంది మొగమోడు పంది మొగమోడికీ పంచల చాపెడితేను ఇప్పేడు కట్టేడు ఈదీన నడువాడు చాకిరేవెయ్యాడు సబ్బూ పెట్టాడు పెళ్లాని కివ్వాడు పెట్లోను పెట్టాడు. |