| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 097. దంపు పాట |
|
ఏపా చెట్టూకాడ నా బొమ్మరిల్లూ కూకోర అన్నయ్య కూడొండుతాను కూకోర అన్నయ్య కూడొండుతాను కూటీకి కాదప్ప కూతురి కొచ్చానూ కూటీకి కాదప్ప కూతురి కొచ్చానూ కూతూరు చిన్నాది కులము గొప్పాదీ కూతూరు చిన్నాది కులము గొప్పాదీ అల్లూడు పెద్దోడు వేసిగలోడూ అల్లూడు పెద్దోడు వేసిగలోడూ ఓలేమి యిత్తారు ఓ పెద్దలారా ఓలేమి యిత్తారు ఓ పెద్దలారా అరుగు మీదరవయ్యి ఓలు ముప్పయ్యి ఏపా చెట్టూకాడ నా బొమ్మరిల్లూ కూకోర అన్నయ్య కూడొండుతాను |