| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (చందమామతో మాట్లాడడం వారి గుత్తకదూ మరి) |
| 105. చందమామ |
|
చందమామ చందమామ ఓ చందమామా నీ సందడీలు నెలాకన్నా శ్రీ రంగధామా ముత్యాలూ పగడాలూ కలబోసీ నట్లూ నా ముచ్చటైనా తీరదాయే ఓ చందమామా పాలూనూ పంచదార కలబోసి నట్లూ నే కలబోసి నట్లూ నా పంతమైనా తీరదాయె ఓ చందమామా వచ్చీపోయే దారిలోనూ చామరెండా బోసి నే చామరెండా బోసి నా చామలన్నీ చామలాయెను ఓ చందమామా కుదురూ గుమ్మడీ కింద కురిసిందీ వాన ఆ, కురిసిందీ వాన నా కురులన్నీ విరులాయెనూ ఓ చందమామా. |