| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (నోముల ఫలాలు ఇటువంటివట - కాని ఒక్కకొడుకూ, ఒక్క కూతురూ వుంటేనే పొట్ట బాదుకొనే నేడు - ఆ నోములూ వద్దు - నూరుగురు కొడుకులూ వద్దు అనుకోడం విడ్డూరం అనిపించదుగా) |
| 107. చందమామా |
|
నూరు నోములు నోచి సందమామా నూరుగురు కొడుకుల్ని కంది సందమామా కోటి నోములూ నోచి సందమామా కోటికడళ్ళనెపొందె సందమామా వేయి నోములు నోచీ సందమామా వేసింది కోటనూ సందమామా |