| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 109. సువ్వి పాట |
|
సువ్వీ సువ్వీ సువ్వానీ సుదములు దంచెద రో-లాల వనితల మనసులు కుందెన చేసిటు వలపులు తగనించో-ఓలాల కనుసన్నలనెడి రోంకండ్లానూ కన్నెలు దంచెద రో-లాల బంగరు చెరగుల పట్టుపుట్టములు కంగులు దూలగ నో-లాల అంగనలందరు నతివేడుకతో సంగడి దంచెద రో-లాల కురులు దూలగమంచి చన్నూలపై సరులు దూలాడంగ నో-లాల అరవిరిబాగుల నతివలు ముద్దులు గురియుచు దంచెద రో-లాల ఘల్లుఘల్లుమని కంకణ రవములు పల్లవ పాణుల కో-లాల అల్లన నడుములు అలసియాడ సతు లొల్లన దంచెద రో-లాల కప్పుర గంధులు కమ్మని పువ్వుల చప్పరంబులనే-ఓలాల తెప్పలుగారతి దేలుచు గోనే టప్పని బడెదరో-లాల. |