| ఇతిహాసములు | రంగనాథరామాయణము | సుందరాకాండము |
|
దలఁచుచు మెలఁగ నత్తఱి విస్మయముగఁ గలితభయంకరాకారంబుతోడఁ[వా.రా. సర్గ 3] బెన్నిధి సాధింపఁబ్రీతిమై నరుగు చున్న సాధకునకు నొగి నడ్డపడఁగ వడి మహాభూతంబు వచ్చు చందమున నడరి లంకిణి వచ్చి యడ్డమై నిలిచి యట్టహాసము సేసి యనిలనందనుని దట్టించి పలికెఁగ్రోధంబు రెట్టింప: “నీ వెవ్వఁడవు? మఱి నీకుఁబేరేమి? నీ వీ పురంబులోనికి వచ్చు టెట్టు? లెవ్వరు వంచినా రెఱిఁగింపు?”మనిన, నవ్వాయునందనుఁడచలుఁడై 7పలికె: “నీ వెవ్వతెవు? మఱి నీకుఁబేరేమి? నీవేల యడ్డమై నిలిచితి నాకు? మున్ను నీ వెఱిఁగింపు ముదిత! యా వెన్క నున్నట్లు నా తెఱంగొనరఁజెప్పెదను.” అని పల్క:“నేను దశాననునాజ్ఞఁ బనిపూని యీ 8పురి బలిమి రక్షింతుఁ? బేరు లంకిణి యండ్రు; పెఱవారిఁగన్న బోరనఁబొరిగొందుఁబోనీక.”యనిన హనుమంతుఁ డయ్యింతికనియె వెండియును: “వనిత! యీ పురిఁజూచువాఁడనై యేను జనుదెంచితిని; వేగ చనఁగని.”మ్మనినఁ గనులఁగోపమున నక్కఱకు రక్కసియు: “నెక్కడఁబోయెద వింక నాచేతఁ జిక్కితిగా.”కంచుఁ జెలఁగి మై వెంచి: “కఱకఱి నినుఁబట్టి కదిసి నీ మేను 9దఱిగి నీ రక్తముల్ ద్రావెద.”ననుచుఁ గడుఁగోపమెసగ నక్కపినాథు ఱొమ్ము పొడిచినఁ‘బొలఁతిఁజంపుట పాప’మంచుఁ దడయక మారుతి దాని వక్షంబుఁ బిడికిటఁబొడిచినఁబెంపెల్లఁ10 దక్కి యిలమీఁదఁ బడి కడుహీన 11సత్త్వమునఁ బలుమాఱు హనుమంతుఁబ్రార్థించిపలికెఁ: “గపికులోత్తమ! నన్నుఁగరుణింపుమయ్య! నిపుణుఁడై యీ పురి నిర్మించునాఁడు వనజాసనుఁడు నాకు వరమిచ్చినాఁడు; “వనచరుఁడొక్కఁడు వచ్చి నిన్నెదిరి యెన్నఁడు నొప్పించు 12నిది యాదిగాఁగఁ గ్రన్నన రాక్షస క్షయమగు.”ననుచుఁ గాన నీ తలచినకార్యసంసిద్ధు లౌ.”నంచు దీవించి యా యింతి సనియెఁ. దనమది మారుతి దాని మాటలకు ననువంద నుబ్బి మిన్నంది పెల్లార్చి[వా.రా. సర్గ 4] ‘చెడుదురు రాక్షసుల్ సిద్ధ’ మటంచు నెడమకాల్ మున్నుగా నిల నడుగిడుచుఁ. |