| ఇతిహాసములు | రంగనాథరామాయణము | సుందరాకాండము |
|
బసిఁడి 28గోడలతోడ భాసిల్లు 29చున్న యసమానమైన యుద్యానంబుఁగాంచి[వా.రా. సర్గ 12] మెల్లన నటపోయి మెలఁగ వీక్షించి యల్లనల్లనఁబ్రాఁకి యా30గోడలెక్కి చందనపున్నాగ సహకారతరుల మందారఖర్జూర మాతులుంగములఁ బనస పిప్పల నింబ పాటలీ వకుళ ఘనసార 31సౌవీరకర్ణికారముల మల్లికామాలతీ మాధవీ లతల సల్లకీ కురవక జంబీర తరులఁ దాల తమాల హింతాల సాలముల నాళికే రాశోక నాగవల్లరుల నేడాకుటనఁటుల నేలాలవంగ దాడిమీ నారంగ తక్కోలకములఁ గదళికా కేతకీ క్రముక భూజములఁ బదనైనగోస్తనీ ఫలగుళుచ్ఛములఁ బరిపక్వ ఫలపుష్పపరిమళమిళిత భరితమౌ వాయుసంపదల నింపెక్కి కలకంఠశుక నీలకంఠ శారికలఁ జెలువొంది యళులచేఁ జెలు వగ్గలించి కమలాకరమ్ములఁగరము శోభిల్లి కుముదసంఘములఁగొమరు దీపించి శశికాంతవేదుల సన్నుతి కెక్కి విశదచంద్రికలచే వేడ్క సొంపెక్కి సికతా తలంబులచేఁజెన్ను మీఱి సకలర్తువిహరణస్థానమై మిగుల రమణమై నది చైత్రరథమును మించి యమరేంద్రునందనోద్యానంబువోలె నలరు రావణువినోదారామభూమిఁ గలయంగఁగనుఁగొని కడుఁజోద్యమంది యొప్పునా వనభూమి కొయ్యన డిగ్గి చప్పుడు గాకుండఁజరణంబు లిడుచుఁ గొలఁకులయందును గూలంబులందుఁ బులినదేశములందుఁ బొదరిండ్లయందు నుర్వీరుహములందు నోలంబులందు నుర్వీతనూభవ నుడుగక వెదకి యా వనమధ్యంబునందు రేవగలు గావలియుండు రాక్షసకోటి కెపుడుఁ దావలంబై మిన్ను తలదన్ను పొడవు చే వెలుంగుచు మేరుశిఖరాళిఁగేరు పసిఁడికుంభములచేఁ బసమీఱి వెలయు పసిఁడికంబంబులఁబఱపు దీపించి వరరత్న తోరణావళుల శోభిల్లి యురుతరంబగుచున్న యొకమేడఁగాంచి యా మేడలోపల నంతయు వెదకి భూమిజఁ గానక బుద్ధిలో వగచి: |