| ఇతిహాసములు | రంగనాథరామాయణము | సుందరాకాండము |
|
ధన్య68మందోదరి తగఁజేరి:“యిట్టి యన్యాయ మేటికి? నబల యీ సీత యభిమానవతి మానవాంగన; దీని కభిలాషపడి యింత యలయంగ నేల? నీ యంతిపురమున నెలఁతలలోన నీ యింతి చింతింప నెవ్వరిఁబోలు? ననుఁగూడి క్రీడింపు నాథ! యీ చేఁత నినువంటివానికి నీతిగా.”దనినఁ గడు సిగ్గువడి చాలఁగలుషించి సీత కడ నున్న దుష్టరాక్షసవధూజనుల నతిదీర్ఘతనుల భయంకరాకృతుల సతత నిష్ఠురవాక్య సమరకర్కశల వినత నయోముఖి వికట హయాస్య యనుదాని హరిజట యనుదానిఁద్రిజటఁ బ్రఘ69న మహోదరిఁబాటించి పిలిచి లఘువృత్తిఁ70 బలికె నిర్లజ్జుఁడై 71నిలిచి: “ప్రియనయోక్తులనైన బెదరించియైన భయద చేష్టలనైన బాధించియైన మాసద్వయంబున మగువ నా సొమ్ము చేసి తెం; 72డటు మీరు సేయలేకున్న, నంతటిమీఁద నీ యబ్జాక్షిఁజంపి యింతలింతలుకండ లిందఱుఁదినుఁడు.” అని యశోకారామ మప్పుడు వెడలి తన నగరికిఁబోయె దనుజవల్లభుఁడు.[వా.రా. సర్గ 22] |