| ఇతిహాసములు | రంగనాథరామాయణము | సుందరాకాండము |
|
అపుడు జానకి దానవాంగనలెల్లఁ గృపమాలి తమతమకృతకవాక్యముల బోధించి‘రావణుఁబొందు మీ.’వనుచు బాధించు తఱి శూలపాణియై యొక్క రక్కసి బెదరించు:“రాముఁడీలంక దిక్కుసూడఁగలేఁడు; తెఱవ! యాయాస విడు.”మంచు నొకయింతి వెడమతిఁ బల్కు “నిడుమలఁబడియుండ నేల నీ కిట్లు? వరియింపు దానవేశ్వరునిఁ;గాదేని పొరిగొందు.”నని యొక్కపొలఁతి73 మార్మలయుఁ. “దెండు ఖడ్గము; తల తెగఁగొట్టి దీని కండలు కమ్మఁగాఁగల్లుతో నద్ది చవిచూత”మని యొక్కజంత74భర్జించు “నవు నవునిటు సేయుఁ”డని యోర్తువదరు |