| ఇతిహాసములు | రంగనాథరామాయణము | సుందరాకాండము |
|
నంత నా త్రిజటయు నవనీతనూజ సంతాప మటు చూడఁజాలక తొలఁగి[వా.రా. సర్గ 27] నెలకొని యొకచోట నిద్రించి లేచి కలగని రాక్షసకాంతలఁ జూచి: “యొక కల గంటినే నో యింతులార! ప్రకటించి చెప్పెదఁబాటించి వినుఁడు: రాముఁడేనుఁగునెక్కి రాఁజూడఁ గంటి; సౌమిత్రి భృత్యుఁడై చనుదేరఁ గంటి; నా మహాగజముపై నవనివల్లభుఁడు గోమలి నెక్కించుకొని పోవఁ గంటిఁ; బట్టాభిషిక్తుఁడై బ్రహ్మాదిసురలు గట్టిగాఁగొల్వ రాఘవుఁడుండఁ గంటిఁ; గమనీయమగు పుష్పకముమీఁద నుండి బ్రమసి రావణుఁడుర్విపైఁ గూలఁ గంటి; గూలినరావణుఁగ్రూ76రాసి నొకతె నీలాంబర77ముతోడ నెఱిఁజేరఁగంటిఁ; జేరి రావణుతలల్ చెలువే 78ది కూల్చి భూరిగార్దభములఁ బూనిన రథము నం దుగ్రముగ వైచి యామ్యదిక్కునకుఁ గొందల79పడ నీడ్చికొని పోవఁగంటి; గురుతరోష్ట్రము నెక్కి కుంభకర్ణుండు తిరమేది దక్షిణదిశ కేఁగఁ గంటి; దనరారుతోరణతతులతోఁ గూడ వనధిలోపల లంక వడిఁ గూలఁ గంటి; దైలధారలఁ దోఁగి దానవులెల్ల నేల నూరక పడి నిద్రింపఁ గంటి; ధవళాతపత్రియై దంతిపై నెక్కి సవినయుఁడై విభీషణుఁ డుండఁ గంటి. రావణుమరణంబు రఘురాముజయము నే విధంబున సిద్ధ మిటమీఁద నింక. నటుగాన మీర లీ యవనీతనూజఁ బటుదుష్టభాషల భర్జింప వలదు. తొలఁగిపొం”డనవుడుఁ దొలఁగి నిద్రించి 80రలసి రాక్షసకాంత81లందఱు నంత.[వా.రా. సర్గ 28] నా సమయంబున నవనీతనూజ గాసిల్లి భయశోక కంపిత యగుచుఁ దన్ను రెన్నెల్లకు దయమాలి చంపు మన్న రావణుమాట 82లందంద తలఁచి శోకంబు గ్రమ్మ నశోకంబుకొమ్మ నా కొమ్మ యూఁతగా నటు లేచి నిలిచి లోలత నడవులలో నొంటిఁబడిన బాలికయును బోలెఁబలవింపఁదొడఁగె. “నక్కటా! దైవంబ! యదయత నన్ను నిక్కడ చెఱఁబెట్టి యిటు లేఁచఁదగునె? ‘ఖలదైత్యుచేఁ జావఁగలవు నీ.’వనుచు నలినసూతి లిఖించినాఁడొ? నా నొస83టఁ; గాకున్న మఱి దండకావనంబునకుఁ గాకుత్స్థకులుఁడు రాఁ గారణంబేమి? పైఁడి మృగంబు నన్ భ్రమియింప నేల? వీఁడిట్టుచెఱవట్టి 84వెతఁబెట్టనేల? నాకేమి చింతింప? నా కూర్మివిభుఁడు రాకేందువదనుండు రామచంద్రుండు లోకరక్షణకలాలోలమానసుఁడు నాకుఁగా ఘోరకాంతారమధ్యమున సౌమిత్రియును దానుఁజాలిమైఁదూలి యేమి గాఁగలవాఁడొ; యెట్లున్న వాఁడొ? యెన్నఁ85డు ఘనశౌర్యుఁడిటకెత్తివచ్చు? నిన్నీచదైత్యుని నెన్నఁడుక్కడఁచుఁ దుది నన్నునెన్నఁడు దోడ్కొనిపోవు? నిదియెన్నఁటికిఁగూడు? నిదియెట్లుపొసఁగు నీ దురాత్మకుచేత నిట చచ్చుకంటె 86నాదిఁజచ్చెద నన్న నట విషంబైన వాలిన దయనిచ్చు వారిందులేరు హా లక్ష్మణాగ్రజ! హా ధర్మనిరత! నీకైనయేకపత్నీత్వంబు నేఁడు చీకాకుపడ హత్యచేఁజత్తు.” ననుచుఁ గెరలిన తన దీర్ఘ కేశపాశముల నురి వెట్టికొని చావ నూహించి నంత నా లోన నెడమకన్నదరె నా సతికి 87వాలు మీనులచేత వనజంబువోలె. వలపుఁదెమ్మెరలచే వనలతవోలెఁ బొలఁతికి మఱి వామభుజమును నదరె. నయ్యెడ మదహస్తి హస్తంబువోలెఁ దొయ్యలి డాఁపలి తొడయును నదరె. ఘోర రాహువిముక్త కువలయహితుని తీరున ముఖచంద్రదీప్తు లింపెసగె. శుభసూచకంబు లీ చొప్పున నొదవ నిభరాజగమన యయ్యెడఁదెంపుమాని జనకుని శ్రీరామచంద్రుని నతని యనుజుల నత్తల నట తలంచుచును దనుజులచేతి బాధలఁజాల నలసి తన దిక్కులేమికిఁ దరలాక్షి వగవ సుదతిచిత్తములోని శోకంబు మాన్ప నిది నాకుఁదఱియని యిచ్చఁజింతించి[వా.రా. సర్గ 29] |