| ఇతిహాసములు | రంగనాథరామాయణము | సుందరాకాండము |
|
రవికులక్రమమును రాముపౌరుషము వివిధభంగుల వేడ్క వినుతిసేయుచును మ్రానిమీఁదనె యుండి మారుతాత్మజుఁడు “వానరభాష గీర్వాణభాషయును నీ నాతి యెఱుఁగునో యెఱుఁగదో!”యనుచు మానవభాషల మగువ కిట్లనియె: “నో మహీనందన! యో పుణ్యసాధ్వి! యీ మెయి శోకింప88నేటికి నీకు? మగువ! నీ విభుఁడు సేమమున నున్నాఁడు! జగదేకపతి రామజనపాలకుండు వనధి బంధించి రావణు సంహరించి నినుఁ89గొనిపోయెడు; నిక్క మీ పల్కు. సహజన్ముఁడైన లక్ష్మణుఁడు తన్గొల్వ మహనీయమహిమతో మాల్యవంతమున నున్నాఁడు కపిసేన లొగి ననేకములు తన్నర్థి90సేవింప దశరథాత్మజుఁడు.”[వా.రా. సర్గ 30, 31] అనవుడు“నిది యొక్కయశరీరవాణి” యని శింశుపావృక్ష మవనిజ సూడఁ 91బ్రన్ననినీలాభ్ర92పటలంబులోని క్రున్నెలవోలె మెఱుంగునుబోలె సన్నమై యా మ్రానిశాఖల93నడుమ నున్నమర్కటరూప మొయ్యనఁగాంచి “కలలోనఁబ్లవగంబుఁ94గంటి నే.”ననుచుఁ గలఁగి“యా కల కీడు కాకుత్థ్సజులకుఁ గాకుండుగా!”కంచు ఘనుల దేవతలఁ బాకశాసన బృహస్పతి వీతిహోత్ర లోకేశ్వరులను మేల్కొని భక్తితోడ నా కాంత గొనియాడి యట తెలివొంది (‘తలఁగక వేమఱుఁదలఁచినయట్టి తలఁపును బేర్కొని తన విన్నయదియుఁ “గల యౌను; నిద్ర రాఘవుఁగాని మదిని దలఁపను మఱియొండు; ధన్యుశ్రీరాము ననఘుని మత్ప్రియు నహిమాంశువంశు వినుతవర్తనుఁబాసి విరహాగ్నిఁగ్రాఁగి;) కంటకాసురకోటి గారించుకతనఁ గంటికి నిదుర నేఁగాన రేవగలుఁ; గాన నిద్దురలేని కల యెందుఁగలదు? పూని యింకొకసారి పోలంగఁజూతు.” నని తన వదనాబ్జ మల్లన నెత్తి హనుమంతు మఱియును నందంద చూచి: “యెందుండివచ్చెనో యీ మ్రానిమీఁది కెందునుఁగడుఁజిత్ర మిది యొక్కక్రోఁతి! చెలువొప్ప నరుఁడు భాషించుచందమున నలినాప్తకులుఁ95డు నానాథు సేమంబు నలవడఁదెలుపుచు నమృతంబులొలుకఁ బలుమాఱుఁబ్రియమునఁబలుకుచున్నదియు. వానరజాతి కీ వార్తలు గలవె? నానావిధంబుల నాకుఁజింతింపఁ 96గడఁగిరాక్షసమాయగాఁబోలు.”ననుచుఁ బడఁతియూరకయుండెఁబ్రతిభాషలుడిగి. |