ఇతిహాసములు రంగనాథరామాయణము సుందరాకాండము
అంగుళీయకప్రదానము
యనిలనందనుఁడంత నవనీతనూజ
మనమునఁదన్ను నమ్మమిఁ97జాలనెఱిఁగి
యా98తరువటు డిగ్గి యతిభక్తియుక్తి
నాతికి దండప్రణామముల్‌ సేసి
కరములు మోడ్చి:“యోకల్యాణి! నమ్ము;
పరికింపు మేను నీ పతి కూర్చుబంట;
జనపతి నీకు విశ్వాసంబు పుట్టు
నని యిచ్చి పుత్తెంచె నంగుళీయకము.”
ననిచూపి99 మ్రొక్కిన నవనీతనూజ
హనుమంతుఁగనుఁగొని యతనికిట్లనియె.
“నడరెడుదనుజమాయల100ననుగలము
నుడుకులఁబడి వేఁగుచుండుదుఁగాన
యనఘాత్మ! రఘురామునంగుళీయకముఁ
గనియు విశ్వాసంబు గలుగదు నాకు.
నీ వెవ్వఁడవు? మఱినీకుఁబేరేమి?
భూవరునకు నీకుఁబొందెటుగలిగె?
నినకులాధిపురూప మెట్టిది? యతని
యనుజుండు సౌమిత్రి యతఁడెట్టివాఁడు?
కాకుత్థ్సుఁడిప్పుడెక్కడ నున్నవాఁడు?
నీకు నేమని చెప్పి నిన్నుఁబుత్తెంచె.
నే చందమున వచ్చి తీ వార్ధి దాటి
నా చిత్తమూఱడ నాతోడఁజెప్పు?”
మని యొప్ప నడిగిన యవనినందనకు
హనుమంతుఁడంతయు నట చెప్పఁదొడఁగె:
“వనజాక్షి! వాయుదేవర వరంబడిగి
ఘనుఁడు కేసరియను కపికులాగ్రణికి
ననుఁబుత్త్రుగా నంజనాదేవి గనియె.
హనుమంతుఁడనుపేర నమరినవాఁడ;
వసుధ సుగ్రీవుఁడన్వానరేంద్రునకు
నసమానమతి మంత్రినై101మెలంగుదును
ఆతని రాజ్యంబు నాతని పత్ని
నాతనియగ్రజుండగు వాలి గొన్న
మదమేది నలువురుమంత్రులుఁదాను
నదిమొదల్‌ ఋష్యమూకాద్రిపై నుండఁ
బటుసత్త్వమున102వచ్చి పంక్తికంధరుఁడు
కుటిలుఁడై నిన్నెత్తుకొని పోవుచుండ
నొదవిన 103యాక్రోశ మూరక వినుచు
సుదతి! నిన్‌దలలెత్తి చూచుచుండితిమి
నెలఁత! యప్పుడు మమ్ము నీవును జూచి
తొలఁగక 104నీ మేనితొడవులఁబుచ్చి
నీ వస్త్రమునఁగట్టి నేలవైచుటయు
నా వేళ సుగ్రీవుఁడవి యెత్తి దాఁచె
నచ్చుగా రఘురాముఁడట నిన్ను వెదక
వచ్చి పంపాసరోవర తీర భూమిఁ
దానుఁదమ్ముఁడు నున్న తఱిఁజూచి యర్క
సూనుండు వారలఁజూచి రమ్మనిన
నే నేఁగి105యంతయు నెఱిఁగి యేతెంచి
భానుజు రామభూపతిఁగానుపింప
నన్నరనాథున కర్కనందనుఁడు
కన్నసొమ్ములు సూపి కడుభక్తి మ్రొక్క
నా తొడవులఁజూచి హర్హించి రాముఁ
డాతని నిజశత్రుఁడగు వాలిఁజంపి
యుపకారశీలుఁడై యొప్పు సుగ్రీవుఁ
గపిరాజ్యపదమునఁగరమర్థి నిలిపె.
నతిభక్తి సుగ్రీవుఁడంత రాఘవునిఁ
బతియుఁగా నిజభృత్యభావంబు మోచి
యక్షీణబలధన్యులైన వానరుల
లక్షయు రెండేసి లక్షలుఁగూర్చి:
“106గర్వులౌదైత్యుల కటకంబులరసి
యుర్వీతనూభవ యున్నచో టెఱిఁగి
మసలక నెలలోన మగుడి రం.”డనిన
నసమునఁగపులేఁగి రన్ని దిక్కులకుఁ.
బటుశక్తి దక్షిణభాగంబు వెదక
నిట యంగదుఁడు మొదలేము గొందఱము
చనుదెంచి పెక్కు దేశంబులు వెదకి
నినుఁ గాననేరక నివ్వెఱఁగంది
శోకింప నరుణునిసుతుఁడు సంపాతి
మాకు లంకాపురిమార్గంబు సూపెఁ.
జూపుటయును నిన్నుఁజూడ నర్థించి
యేపునఁబఱతెంచి యే నబ్ధి దాటి
మఱినేఁడు సూర్యాస్తమయమున నితరు
లెఱుఁగకుండఁగ వచ్చి యీ లంక సొచ్చి
విలసిల్లు నా మహావేషంబు దాఁచి
సొలవక నిన్నెల్లచోటుల వెదకి
యెందును107గానక యిట కేఁగుదెంచి
యిందు నిన్‌దర్శించి యేర్పడఁజూచి
రవికులాధిపుఁడైన రామునిదేవి
యవునొకో కాదొకో యని విచారించి
సృష్టీశుచే విన్న చిహ్నంబులెల్ల
దృష్టించి పిదప సందేహంబు వాసి
వల108నేది యిప్పుడు వచ్చి రావణుఁడు
తలఁ109గక నినుఁబల్కుతఱి నున్నవాఁడ
ఘనశక్తి వానితోఁగయ్యంబు సేసి
యని వానిఁజంపెద నని విచారించి
పూని నిన్‌దర్శించి 110పొందుగా నీకు
నీ నాథుసేమంబు నిజముగాఁజెప్పి
దనుజుఁబిమ్మటఁజంపఁదలపోసికాని
వనిత! నా ప్రాణముల్‌ వంచించి కాదు.’
అని చెప్పి రఘురాము నలవుఁబ్రాయంబుఁ
గనుఁగవ చెలువంబు గళముసోయగము
నగుమోముకళయును నఖములతీరు
నెగుబుజంబులబాగు నిఱికౌనులాగు
వెడఁదరొమ్ముబెడంగు వీనులరంగు
నడలయందంబును నాభిచందంబు
ఘన జఘనముపెంపుఁగరముల 111కెంపుఁ
దనువులక్షణములుఁ దప్పక చెప్పి
యా శౌర్య మా ధైర్య మా బ్రహ్మచర్య
మా శాంతి యా దాంతి యా మహాక్షాంతి
యా శక్తి యా యుక్తి యా పితృభక్తి
యా శీల మా లీల లన్నియుఁజెప్పి112
రూపించి లక్ష్మణురూపెల్లఁజెప్పి
యా పుణ్యుఁడంగుళీయక మప్పుడిచ్చె.[వా.రా. సర్గ 33-35]
నిచ్చినఁగైకొని“యిపుడు ప్రాణములు
వచ్చెఁగా!”యనుచు నెవ్వగ నూఱడిల్లి
రాముఁజూచినకంటె రమణి రాగిల్లి
సేమమేర్పడ భద్రసింహాసనమునఁ
బ్రేమతోఁగూర్చుండఁబెట్టిన కరణి
నా మణిముద్రిక నక్కునఁజేర్చి
యనురక్తి నర్ఘ్యపాద్యము లిచ్చినట్లు
కనుఁగవ హర్షాశ్రుకణములు దొరుగ
ధూపదీపమ్ములుఁదోడ్తోన యొసగి
యేపార సాష్టాంగ మెఱిఁగినపగిదిఁ
బులకించి తిలకించి పొలఁతి మూర్ఛిల్లి
తెలిసి యా హనుమంతుదెసఁజూచి పలికెఁ:
“గపివంశవర్య! రాఘవకార్యధుర్య!
యుపకారనిరత! లోకోన్నతచరిత!
పవమానసుత! నాకుఁబ్రాణదానంబుఁ
దవిలి చేసితి; నీకుఁదగఁజేయ లేను
గాకుత్థ్సతిలకుని కరుణ నీ వింక
నా కల్పముగ నుండు.”మనుచు దీవింప
నలఘువిక్రమశీలుఁడగు వాయుసుతుఁడు
చెలువ జానకిఁజూచి చేతులు మొగిచి:
“హరునకునైన నింద్రాదులకైనఁ
బరమేష్ఠికైనను బడయఁజొప్పడని
నీ కృప వడసితి; నినుఁజూడఁగంటి;
నా113కింతచాలదే నలినాయతాక్షి!”
యనిన సీతాదేవి యనియె వెండియును;
మనుజేశు సేమంబు మఱఁదిసేమంబు
మనమాఱ నడుగుచు మమత రెట్టింప:
“ననఘాత్మ! రఘురాముఁ114డసమానబలుఁడు
నను నెడఁబాసియున్నాఁడె ధైర్యమున?
ననుజుండుఁదానును నప్పటప్పటికి
దయ నన్నుఁదలఁ115తురే? దండెత్తి యిటకు
రయమున116వత్తురే రణకాంక్ష?”ననిన:
“వినవమ్మ, నీ ప్రాణవిభునిసేమంబు:
నినుఁబాసినదిమొదల్‌ నిత్యవేదనల
నేలపైఁబవళించు; నిద్రయెఱుంగఁ;
డోలి117మాంసాహార మొల్ల”డెన్నఁడును.
వాసిమై దండకావనములో నిన్ను
మోసపోవుట యెంచు; మోమరవాంచు;
నిట్టూర్పు నిగుడించు; నించుఁగన్నీరు;
నెట్టన మూర్ఛిల్లు; నేలపైఁద్రెళ్లుఁ;
దెలివిమై లేచు; నల్దిక్కులు సూచుఁ;
గలఁగు; నివ్వెఱఁగందుఁ;గళవళమందు
“హా సీత! హాసీత!”యని ప్రలాపించు;
నా సుమిత్రాపుత్త్రుఁడది చూచి వగచుఁ.
గావున మీరలిక్కడ నుండు వార్త
వేవేగ నా చేత విన్నంతఁగదలి
నాకంటె ఘనులైన నగచరాధిపుల
భీకరాకృతుల నభేద్యవిక్రముల
నగశృంగతరుసంఘనఖముఖాయుధుల
నగణితబలుల దేవాంశసంభవుల
సుగ్రీవ నల వాలిసుతులాదియైన
యుగ్రవీరులఁగూడి యుదధి118లంఘించి
యెల్లభంగుల వచ్చు నింతి! నీ విభుఁడు;
తల్లి! నిన్‌ గొని యయోధ్యాపురి కరుగు;
రాముచే రణమున రావణుఁడీల్గు;
నీ మది కోర్కులు నీకు సిద్ధించు.
నైన నీ తడవేల యఖిలైకమాత?
యేను నా వీపున నిడికొని ప్రీతి
యొదవిన కడఁకతో నుదధి లంఘించి
యుదయవేళకుఁబోదు నుర్వీశుకడకు119[వా.రా. సర్గ 36]
విచ్చేయు.”మనవుడు వెలఁది వాయుజుని
సచ్చరిత్రమునకు సంతోషమంది
“యో సమీరాత్మజ! యోపుదు వీవు.
నీ సత్త్వమట్టిద నిజము చింతింప.
ననఘాత్మ! యేఁబెండ్లియైనదిమొదలు
జనలోక120విభు రామచంద్రునిఁ గాని
పొలుపేది యెన్నఁడుఁ బురుషాంతరంబుఁ
గలలోననైనను గదిసి యెఱుంగ.
నీ నీచమతి నన్ను నిట తెచ్చుచోట
వీనియంటుట కేను వేఁగుచుండుదును.
వెఱవక బలిమిమై వీఁ డంటెఁగాక
మఱి యన్యపురుషుల మది నంట నేను.
నా నాథునకు నీవు నమ్మినబంట;
వైనను నిను నెక్కి యరుదెంచు టొల్లఁ.
దన దేవి మ్రుచ్చిలి దైత్యుండు సనిన
నినకులుం డా రీతినే తెచ్చె నండు.
రిది విచారంబుగా; దినకులేశ్వరుఁడు
కొదలేక మును చిత్రకూటంబునందు
నొకనాఁడు తనతొడ నొఱగి నిద్రింపఁ
గ్రకచోగ్రనఖ మొక్క కాకంబు సేరి
చంచుపుటంబునఁజనుఁగవ నడుమఁ
బొంచి చించిన రక్తపూరంబు దొరుగఁ
గాకుత్థ్సతిలకుఁడొక్కట నిద్ర దెలిసి
కాకంబుపై నిషీకముఁబ్రయోగింప
నదియు బ్రహ్మాస్త్రమై యఖిలలోకైక
విదితోగ్రశక్తిమై వెనువెంట నంట
నా కాకి యేకాకియై యెందుఁదిరిగి
కైకొని తనుఁ‘గావు కావు’మటంచు
మరలి క్రమ్మఱఁదనమఱుఁగు సొచ్చుటయు
శరణాగతత్రాణచరితుండుగాన
దానినేత్రము నిజాస్త్రమున కిప్పించె
నా నిమిత్తంబుగా నలినాప్తకులుఁడు.

  1. ↑జూచి యె
  2. ↑తర్వు(రు)డిగివచ్చి
  3. ↑చెప్పిన నమ్మహీపుత్త్రి
  4. ↑యనేకముల - యు
  5. ↑పనుల్‌ నడతునా
  6. ↑ఁబేర్చి
  7. ↑నీ శోక
  8. ↑నీవు నీ
  9. ↑రాముని
  10. ↑గర్వాంధులగుదైత్య
  11. ↑బొడగాన కిట
  12. ↑నొప్పని
  13. ↑కక
  14. ↑పొందొంద, పొలుపొంద
  15. ↑సొంపు
  16. ↑కనకవర్ణం బొండుగాని సౌమిత్రి, జననాధుఁడగురాము చందంబె యనుచు రూపించి…
  17. ↑కిది
  18. ↑డభిరామ, డభిమాన
  19. ↑చునే
  20. ↑వచ్చునే
  21. ↑మై నాహా
  22. ↑బంధించి
  23. ↑నీ పనికిటు సంశయించితివేని - భూపక్షి మృగరూపములఁబూని యెట్టి, రూపున నైనను రూఢినిన్‌ గొనుచు - భూపాలు పాలికిఁబోయెదవేగ, విచ్చేయు…
  24. ↑సుతు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )