| ఇతిహాసములు | రంగనాథరామాయణము | సుందరాకాండము |
|
నాఁటి నాపై ప్రేమ నాఁటియస్త్రంబు నేఁటికి మఱచెనో! యిది హెచ్చరింపు. పదివేలభంగుల బా121ధల కోర్చి పదినెలల్ గడపితిఁబతిఁబాసి యేను. నా యున్కి సూచితి; నా పాటుగంటి; వేయుపాయంబుల నిం దోర్వరాదు. ఉడుగనివగలతో నొక్కొక్కదినము గడచుట యొకవార్ధి గడచుట నాకు. నరనాథుమదిలోన నా మీఁదఁజాలఁ గరుణ వుట్టెడునట్లుగా విన్నవింపు. మా తండ్రి జనకుండు మహిమీఁదఁదన్నుఁ నే తెఱంగున 122బొంకఁడితఁడని నమ్మి తనకు నిచ్చినఁదెచ్చెఁ; దగదు నన్విడువ నని యేను బల్కితినని పల్కు మీవు. విలసిల్లు కల్యాణవేదిపై నుండి వలనొప్ప నగ్ని దేవర సాక్షిగాఁగఁ గరమొప్ప నన్నెల్ల కాలంబు విడువ 123కరసి రక్షించెద నని తెచ్చి నన్ను నరయ కుపేక్షించి యనదగాఁజేసెఁ బరికింపుమని విన్నపము సేయు మనఘ! తన యింతి నొకనిచేఁ దాఁ గోలుపోయి మన నిచ్చసేయుట మగపాఁడిగాదు; అటుగాన తన కిది యపకీర్తి యనుచు నిటు విన్నవించితి; నింతియే కాని కలఁగక నా మనోగతులు ప్రాణంబు లొలసి త124న్నెడఁబాయకున్నవి యనుము. చతురాత్మ! మఱి నీవు సౌమిత్రిఁజేరి యతనితో నొక్క మాటాడుము తెలియ. ననుఁదల్లిగాఁజూచు; నా పాటు చూడఁ దన కెన్ని భంగులఁ దగదని పల్కు. వావిరి దండకావనములోఁబరమ పావనుండగు తన్నుఁబల్కిన ఫలము కుడిచితి నని చెప్పు కొఱఁత లేకుండఁ; దడయకు మని చెప్పు; దయవుట్టఁజెప్పు; మవసరోచితముగా నంగదు తోడ రవిజుతోఁదక్కుమర్కటకోటి తోడ వినయము ల్వల్కి యెవ్విధినైన వారి నినకులులను వేగ నిటకుఁదోడ్తెమ్ము. మిక్కిలి తెగువమై మీ రాక వేచి యొక్కమాసము చూతు; నుండలే నవల. నీ లోన రఘురాము నెబ్భంగినైన వాలాయముగఁదెమ్ము; వడి నింకఁబొమ్ము.” అని సీత వల్కువాక్యములెల్లఁదెలియ విని హనుమంతుండు వినతుఁడై పలికె: “నవుఁగాక, చెప్పెద నన్నికార్యమ్ము; లువిద! నీ మనమున నూఱడు మింక. నచ్చుగా రఘురాము నంగుళీయకముఁ దెచ్చి యొప్పించితి దేవి! నీ కర్థి. ధరణిజ! రిక్తహస్తముతోడ మగుడ మరలుట దూతధర్మము గాదు నాకు; నతివ! ముద్రారత్న మానతి.”మ్మనిన నతనితోఁదెలియ నయ్యవనిజ వలికె: “నీవు విచారింప నిసుమంత గాని లేవు; సముద్ర మేలీల దాటెదవు? ఆరూఢ బలవిక్రమాస్పదంబైన నీ రూప మెట్టిదో నిజముగాఁజూపు. మేను నీ నిజరూప మేర్పడఁజూచి కాని నా తలమానికము నీకు నీయ.” |