ఇతిహాసములు రంగనాథరామాయణము సుందరాకాండము
మారుతి తన విశ్వరూపము సీతకుఁ జూపుట
ననిన నా హనుమంతుఁడాకాశమెల్లఁ
దన మేనునిండ నుద్దండుఁడై పెరిగి
మాలతీమల్లికా మాల్యమై మెడకు
నాలోలతర తారహారమై కటిని
గలధౌతమయ ఘంటికాదామ మగుచుఁ125
దళుకుఁజుక్కలపిండు దనమేన నలర
నతిభీషణాకారుఁడగుచు నిల్చినను
నతివచిత్తంబున నతిభీతిఁబొంది:
“యసమానగాత్ర! యోయంజనాపుత్త్ర!
విసుమాన మీ రూపు, వెసడాఁపు.”మనుచు
హనుమంతుఁగొనియాడి యతనిదీవింపఁ
దన విశ్వరూపంబు తగఁజూచి సురలు
వినుతింప నది దాఁచువెన్నుండు వోలె
ననిలజుఁడంతలో నలఁతియై నిలిచె.
నిలిచినహనుమంతు 126నెమ్మిమైఁజేరఁ
బిలిచి లోకొంగున బిగి127యంగ128ముడిచి
యున్న శిరోరత్న మొయ్యన విడిచి
యన్నాతి ప్రీతిమై నపుడొసగుటయు
వనిత శిరోమణి వలనొప్ప నందు
కొని మ్రొక్కి సీత వీడ్కొని వేడ్క నరిగి:
“పంతంబుతోనింకఁబంక్తికంఠునకు
నింతటఁదనరాకయెఱిఁగింతు.”ననుచుఁ[వా.రా. సర్గ 37-40]

  1. ↑లలితమౌ పదయుగళమునకు మువ్వ - లనువారు విధమున నందందు చూడఁ, దనరిచు
  2. ↑నెలమి
  3. ↑యించి
  4. ↑ఁగట్టి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )