ఇతిహాసములు రంగనాథరామాయణము సుందరాకాండము
అశోకవన విధ్వంసము
దన మదిఁ129గొండొకతడవు చింతించి
వనభంగ మొనరించువాఁడునై పెరిగి
తొడలందుఁబొడమువాతూలఘట్టనలఁ
బడుగుఁబేకయుఁబోలెఁబడ మహీజమ్ము
లా నిత్యకృతి యశోకారామభూమి
మానైనహర్మ్యముల్‌ మహిఁగూలఁదన్ని
మొనసి కేళీ 130గృహంబులు నుగ్గు సేసి
వనమహీరుహములు వడి నేలఁగలపి
కొమ్మలు ఖండించి కుసుమముల్‌ రాల్చి
కమ్మ131ఁదేనెలు సల్లి కాలువల్‌ 132సెఱచి
పూవుఁదీగలు ద్రెంచి పొదరిండ్లు సదిపి
బావులు గలఁచి దోర్బలకేళిఁదేలి
కలకంఠ బకబిసకంఠికా క్రౌంచ
కలహంసశుకశారికామయూరాది[వా.రా. సర్గ 41]
వనపక్షు లార్తరావములతోఁ బాఱ
వనపాలకులు పరువడి మేలుకాంచి
హనుమంతుచేఁతకు నగ్నులై మండి
యనికి సన్నద్ధులై యతిశౌర్యమునను
వినువీథి దిక్కులు వ్రీల నార్చుచును
ననుపమ కరవాలహస్తులై కదియఁ
దనపేరు తనరాక తన పరాక్రమము
వినఁజెప్పి శ్రీరామవిభుకూర్మిబంటు
నొక్కొక్క రాక్షసు నుద్దండ వృత్తి
నొక్కొక్క తరువున నొగిఁగూలనేసి
ప్రథమసంగరకలాప్రారంభుఁడగుచుఁ
బృథివిపైఁబీనుఁగుపెంటలు గాఁగ
భూరిసత్త్వంబునఁబొలుపొందుఘోర
వీరుల నెనిమిదివేల రాక్షసులఁ
బవమానతనయుఁ డప్రతిముఁడై పేర్చి
యవలీలఁదెగటార్చి యార్చిన133బెదరి
యేపఱి ధృతిదూలి యినవంశ్యుదేవిఁ
గాపున్న రాక్షసకాంతలు పాఱి
రావణు లోకవిద్రావణుఁ గాంచి:
“దేవ! నేఁడొకక్రోఁతి తెగువమై వచ్చి
తొలిఁదొలి వైదేహితో మాటలాడి
కలగొన వనమెల్ల గాసిగాఁబెఱికి
వెనుదన్ని 134యెనిమిదివేల రాక్షసుల
వనపాలకులఁ జంపి వాలుచున్నాఁడు.
వాఁడు రాఘవుఁడంప వచ్చినవాఁడు
గాఁడేని యా సీత గాపుగానున్న
తరువొక్కటియుఁదక్కఁ దక్కినవనముఁ
గరమల్గి పెఱుకఁగాఁగారణంబేమి?
వాని తెఱంగెల్ల వైదేహి నడుగఁ
దా నెఱుంగనటంచు దాఁచుచున్నదియుఁ.
గావున వాఁడు రాఘవుని దూతౌట
యే విధంబున సిద్ధ; మిటమీఁద వాని
నెట్టనఁగడిమిమై నీలావు మెఱసి
పట్టి శిక్షింపుము ప్రాభవంబొప్ప.”[వా.రా. సర్గ 42]

  1. ↑గొండుక
  2. ↑శైలములు
  3. ↑బోదెలు
  4. ↑పూడ్చి
  5. ↑ఁజూచి
  6. ↑ఎనుబది
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )