| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
లవణుఁ డాహారేచ్ఛ లలి వీడు వెడలె యవనీశుసుతుడంత యమున వే దాటి బాణబాణాసనపాణియై వెంట తూణీరయుగమొప్ప దుర్జయుండగుచు పొలుపార మధువేలు పురము గోపురము పొలమున కేతెంచి పొలుపారనుండె నాయెడ మాధ్యాహ్న మగుచున్న వేళ వేయుప్రాణుల జంపి వెస గొంచు వచ్చి యాయతకోదండహస్తుఁడై దీప్త నాయకుఁడైయున్న శత్రుఘ్నుఁ గనియె కని దిగంతంబులు గగనంబు వగుల పెనునవ్వు నవ్వుచు బిట్టేచి పలికె నీ చేతివిల్లును నీ యంపదొనలు నీ చందమున జూడ నీవు నాతోఁడ నని సేయు తలుపొకో యటుగాకయున్న యొనఁ బెట్టుకొని యేలనున్నాడ విచట నీ దర్పమణచెద నీయట్టివారి మేదినిపై నేను మ్రింగినవారు కొలదిఁ బెట్టగరారు కోటులు గలరు తొలఁగక నిలువు నీ త్రుల్లడంచెదను నీవెంట గొని నన్ను నేమిసేయంగ నీవు చాలుదె నాకు నిను జంపుటెంత వడి బడి కార్చిచ్చు వాతనీరైన మిడుత చందముగాగ మ్రింగెద నిన్ను కడుక్రొవ్వి వచ్చి నా కంఠమార్గమునఁ బడి త్రుంగితివి పోర పారిపోఁగలవె రణభూమిలో నాకు రాజన్యగణము గణుతింప తృణమునకంటె నికృష్ట మనుడు గోపావేశ మడరంగ జెమట జనియింప దృష్టుల సరి నిప్పులురుల నోరోరి రాక్షస యోరి నీచాత్మ యోరి యొక్కట నన్ను నోర్చిన పిదప మరికదా నీరజ్జుమాటలు నన్ను నెఱుగవె దశరథాధీశునందనుఁడ దశకంఠు రణవీథిఁ దలలు ఖండించి పశువు గావించిన పరమదీక్షితుఁడు మనుజనాయకశిఖామణియైన రాము ననుజుఁడ శత్రుఘ్నుఁడనువాఁడ నేను కడిదిమై నిన్నాజిఁ గడతేర్చుకొఱకు వడినెత్తి నీమీఁద వచ్చినవాఁడ బటుపాపవృత్తివి ప్రాణఘాతకుఁడ వటు గాన వధకు నీ వర్హుఁడ వనిన మగటిమ నుతిగన్న మా మేనమామ యగు దశగ్రీవుని యాజిరంగమున సకలబాంధవమంత్రిజన పుత్రమిత్ర నికరంబుతోఁ గూడ నిర్జించినాఁడు మీయన్న యా! మారు మీకులంబెల్ల పాయక రోషాగ్ని భస్మీకరింతు నాయత్తపడి యుండుమనిన నీవిపుడు పోయెదవో నినుఁ బోనీను గాని పుడమి శత్రుఘ్నుండుఁ బుట్టనినాఁడు కడిది వీరుఁడవైతి గాక నేడగుటె??? నారాముచే పడ్డ నారాక్షసాధీశు నారావణునిఁ జూచి యలరు దేవతల పగిది నాచే నీవు పడియున్న నిన్ను మొగి చూచి మునులెల్ల ముదమునొందెదరు మసలి నీతోఁ బెక్కు మాటలేమిటికి వసుధ గూల్చెద నన్న వాఁడు గోపించి యవనిపై తన చేతు లందంద జమరి యవడలు దీటుచు నధికదర్పమున నవని బీటలువార నట యొక్కవృక్ష మవలీలఁ బెరికి చే నమరించుకొనుచు నిలునిలు మరువకు నీ పంతమనుచు బలువిడిఁ బరతెంచి బాహులంకించి వృక్షతాడనమున విపులవక్షంబు లక్షించి వైచి యాలవణుండుఁ దొలఁగ నది చూచి శత్రుఘ్నుఁ డామహీరుహము పది తునకలు గాగ భల్లంబు పఱపి వాఁడు వెండియు మీఁద వైచిన తరులు మూఁడేసి మూఁడేసి మురియలు గాగ నిశితాస్త్రముల ద్రుంచి నిండుచీకట్లు దిశలఁ గప్పగ గప్పె తీవ్రబాణముల మధువుసూనుఁడు నొక్కమ్రాకెత్తి పిడుగు విధమున నడునెత్తి వ్రేసె వ్రేయుటయు వెసఁ గోళ్లు చేతులు విరవిర బోవ వశముగాకిలమీద వ్రాలంగ నపుడు క్రందైన గంధర్వగణములు మునులు నందంద దివిజులు నచ్చరల్ జూచి తెరలంగ జాలిన ధృతి చెడి దిశలు మొరసి యాహా కారములు సేయు వినుచు పృథుమూర్ఛ నొందిన పృథివీశతనయు ప్రథి??? నోర్వి మృతుఁడైన భంగిగాఁ దలచి వక్రులై నాచేత వడి బడ్డవారి విక్రమం బరయంగ వీడెంతవాఁడు మరి యెచ్చి యాకలి మలుగంగ నితని యెగమ్రింగెదనంచును నింటి కేతెంచి కనకకుంభమ్ముల కాగిన నీళ్ళు ననువొందగాఁ జల్క మర్థితో నాడి కడువేగ మృగమదగంధాదు లలఁది యడరు మాల్యాభరణావళుల్ దాల్చి తన మనంబున గొంత తామసంబడర దనరిన యాకట దర్పించి పలికె నతిదీనవృత్తితో నవనిపై నట్లు హతుడైన రిపుమాంస మది మ్రింగెదనని యతిఘోరమగు శూల మచటి కేమిటికి ప్రతిభయంకర వీరభటులున్న గాక యని కొంతదడవున కచటి కేతేర మనుజేంద్రతనయుఁ డా మరుపటు దెలసి మునివరుల్ దీపింప మొగి దివ్యు లలర తనరంగ విలుగుణధ్వని చేసి నిలచి రాజేంద్రవిభుఁడైన రాముచే గొన్న రాజితమణిహేమరత్నపుంఖంబు యాజిని గెలిపించు నమ్ములందెల్ల తేజంబు గలుగు నాదివ్యబాణంబు చటులకాలానలసంకాశ మగుచు చిటిలి పెన్నుదురుపై జెదరంగ చూచి దిగిచి చే జంకించి ద్రిప్పిన భుగులు భుగులన మంటలు బొరి మింటనంట భూతముల్ బెదరంగ భువనముల్ దిరుగ నాతతభీతిమై నప్సరల్ మునులు గంధర్వసురసిద్ధగణములు గూడి బంధురద్యుతిఁ బొల్చు పరమేష్ఠి కడకు చనుదెంచి వినతులై చతురాస్య మున్ను వినము గానము యిట్టి విధమైన యరుదు దేవాసురాదుల దెగటార్ప మున్ను గావింపఁబడిన యాఘనసాయకంబు ప్రళయకాలానలప్రభనున్న జూచి కలఁగి వచ్చితిమన్న కమలజుండనియె ముల్లోకములకును ముల్లైనయట్టి బల్లిదు మధుపుత్రు బవరంబులోన నేఁడు శత్రుఘ్నుండు నిర్జించు వాని వాడిశరంబున వధ్యుండు వినుఁడు యాదినారాయణుండైన యాదేవు డీదివ్యశరశక్తి నేర్చె దానవుల నరయ శత్రుఘ్నుండు నాదేవువంశ మరుగుడు వెరవకుండని పల్క వారు చనుదెంచి కనుఁగొన శత్రుఘ్ను డార్చి తునిమెద నింక నీదుష్టాత్ముననుచు బాణాధిరాజమై పరగు నాదివ్య బాణంబు సంధించి బలువేగ దివియ నట్టహాసమున వాఁ డాకాశమద్రువ నెట్టన పదహతి నేల గంపింప పరుషరోషంబున బరవీరవక్ష మిరవార లక్షించి యేసె నేయుటయు నురమును నేలయు నొగి నుబ్బి పారి నురగలోకమునకు నులుకుఁ బుట్టించి యురుకరాళజ్వాల లొండొండ నిగుడ నురువడి మరలియా యుగ్రసాయకము పరతెంచె తూణికి బాణిఘాతమున నొరలుచు లవణుండు నుర్విపై ద్రెళ్ళె పిడుగువ్రేటున బడ్డ పృథివీధరంబు వడుగునఁ బడియున్న వాని నీక్షించి మునిసిద్ధగంధర్వముఖులు నందంద వినుతించి రమ్మహావీరు శత్రుఘ్ను నంత నక్కడ నున్నయట్టివారెల్ల నెంతయు నరుదని యీక్షింపుచుండ శూలి యిచ్చిన మహాశూలంబు నరిగి శూలిశూలము నంద జొచ్చెఁ జొచ్చుటయు |