| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
యనిపల్కి యన్నకు నవనతుండగుచు దన తల్లినగరి కుద్ధతగతిఁ బోయెఁ జెలఁగెడి సింహంబుచేపడి తప్పి మలఁగినవగతోడి మదకరివోలె; భీకరారావ సంస్ఫీతమై పరగి చేకొని పిడు207గువ్రేసిన యద్రిభంగిఁ. జని208యప్డు కైలాస సదృశమైనట్టి ఘనతరంబుగ విశ్వకర్మచేనైన గృహమున నుపవాసకృశ209తమై 210మేన మహితశుక్లాంబరమానిత యగుచు వెన్నెలరసమున211 విదలించి212తివిచి మిన్నేటినురువున మెఱుఁగిడ్డకరణి నరసిన బొమలును నరప చొళ్లియముఁ గరమొప్పి యెంతయు గౌరవంబొలయఁ బన్నుగా213ముదుక కుప్పసములు దొడిగి చెన్నారఁ214బ్రద్దలు సేతులఁబట్టి ముదిసిన215విప్రు లిమ్ముల నెందఱేని వదలక చేరి సావాసులై కొలువఁ గరుణ ప్రవాహంబుగా వచోభంగి సర216సంబు కరడులచందంబు గాఁగఁ బొలుపారు శమదమంబులు తటంబులుగఁ 217గలనరలెల్లఁజొక్కపునుర్వు గాఁగ వెలసినతనయొద్దివేద ఘోషణము సలలితంబగుచున్న జలఘోష మనఁగ వినుత బహుద్విజ వితతులతోడఁ దనరారు నా జహ్ను తనయ నా నొప్పి బహుపురాణంబులు బహువేదములును బహుశాస్త్రములు వెక్కు బ్రహ్మరాక్షసులు బహుభంగిఁజదువంగ బహుమతి వినుచు బహుళనిర్మలశుభప్రభఁదేజరిల్లు చుండియు రావణు నొప్పమిఁదలఁచి కొండంతవగపుఁ జేకొనియున్న తల్లిఁ గాంచి దండమువెట్టి కన్నుల నీరు నించి దుఃఖితుఁడైన నివ్వెఱఁగంది 218కైకసి నందనుఁ గరములనెత్తి చేకొని యక్కునఁజేర్చి యందంద: “లోపలియిండ్ల నాలోకింపరాని యాపద వుట్టెనో? యటుగాక, 219మఱియు బ్రాహ్మణవధము చొప్పడియెనో?కాక, బ్రహ్మ కోపించెనో? పరికించి చూడ, హరుఁడల్గెనో? విష్ణుఁడల్గెనో? రాముఁ డురువడి220మైవచ్చెనో సంభ్రమించి? యిదియేమి నా పుత్త్ర! యింత శోకించె? దిదియేమి వింత? నీ వింతయుఁజెప్పు; మడిగెద; నది విన్నయం221తకు 222నాకు నొడలిలోఁబ్రాణంబు లుండవయ్యెడిని.” అని పల్కుతల్లికి నా విభీషణుఁడు మునుకొని కరములు మొగిచి యిట్లనియె: “నవధారు, దేవి! నీ యగ్రనందనుఁడు రవికులాధీశ్వరురాకకు నేఁడు మంత్రులుఁదానును మంత్రకూటమున మంత్ర మిట్టిది యని మదిఁజర్చసేయ, ‘నిన్నివిచారమ్ములేల? రామునకు నెన్నిభంగుల సీత నిచ్చుట లెస్స; యీకున్న రాఘవుం డీ యబ్ధిఁగట్టి యీ కులంబడఁపక యేల పోనిచ్చు?’ నని223యొత్తి చెప్పిన నా పంక్తికంఠుఁ డనలుండు మండినయాకృతి మండి తన్నె గద్దియతోడ ధరఁబడ నన్నుఁ. దన్ని యంతటఁబోక 224దానవేశ్వరుఁడు అడిదంబుఁగొని వ్రేయ నటు పూనుటయును జెడక నే బ్రదికి వచ్చితి నొక్క భంగిఁ. బోయెద నా రామభూవరుఁగానఁ; బోయి225 యాయనకృపఁబొంది యుండెదను. ఈ వీట నాకింక నెవ్వరు గలరు భావింపఁగా 226నాత్మబంధువు లొరులు?’ ననవుడు నతిభీతయై మూర్ఛనొంది ఘనమైనధైర్యంబుకతమునఁదెలిసి కైకసి నందనుఁగనుఁగొని పలికె: “నీ కథ మున్ను నే నెఱిఁగినదాన; నది యెఱిఁగించెద: నమరులు మునులుఁ ద్రిదశేంద్రుఁడును బ్రహ్మదేవుఁడుఁగూడి యమృతాబ్ధికడ కేఁగి యచ్యుతుఁగాంచి తమ పడ్డయిడుమలు దా రెఱిఁగింప: “నీరసంబున మిమ్ము నేఁచుచునున్న క్రూరుల రావణకుంభకర్ణులను 227జంపెడు కొఱకునై జనియించువాఁడ సొంపార వర్తించుసూర్యవంశమున.” నని దేవుఁడాడినయట్టి వాక్యములు వినిపించె మీ తండ్రి విశదంబుగాఁగ. విని నేను వెఱచి మద్విభున కిట్లంటి: “నెనయంగ నీ కులంబెవ్వఁడు నిలుపు నీ పుత్రకులలోన నిక్కంబు చెప్పు మా పుణ్యుఁడెవ్వఁడో? యనఘ, నా.”కనుడు: “సత్యంబు ధర్మంబు శౌచంబుఁగలిగి నిత్యయశోనిధి నీ కడగొట్టు కొడుకు రామునికృపఁగోరి యీ లంకఁ గడు నొప్పఁబాలింపఁగలవాఁడు మీఁద.’ నని చెప్పి తపమున కరిగె మీ తండ్రి యొనర నమ్మేరునగోపాంతమునకుఁ. గాన రాముఁడె హరి కంజాప్తకులుఁడు; మానిని యా సీత మహనీయలక్ష్మి; విశ్రవసునిమాట వేఱొక్క టగునె? విశ్రుతకీర్తి! యే విధముననైనఁ జనుము రామునిఁగని 228శరణని 229మ్రొక్కి మనుము; రాక్షసకోటి మను230పఁజింతింపు.” మని యక్షతలు వెట్టి యర్మిలిఁబేర్మి తనయుని దీవించి తగ వీడుకొలుప నతఁడును దల్లికి నందంద మ్రొక్కి మతిలోనఁబొంగుచు మంత్రులుఁదాను రావణుతనువునఁబ్రాణంబు లైదు నీ విధంబున నుండ కెగయు నన్‌మాడ్కి వేగంబె యాకాశవీథికి నెగయ నా గుణాఢ్యునిఁజూచి యా లంకవారు తమ తమ వీథులఁ దమదులోఁగిళ్ల గుమురులుగాఁగూడుకొని పల్కిరపుడు: “ధర్మంబు దిగనాడి తమ్ముఁడు నాక పేర్మిపోఁబల్కి విభీషణు విడిచె. నీతియు నెయ్యంబు నేర్పుఁగోల్పడియె నీ తెఱంగున నిప్పుడీ రావణుండు. చెడియెఁగా కీలంక సెప్పనే?”లనుచు నుడుగని వగలతో నుండెడు వారు; “నీ లంక యీతఁడె యేలుఁబొ.”మ్మనుచు బోలించి తమ మనంబుల నెంచువారుఁ; “గోరి231యీతఁడు రాముఁగూడుఁగా కేమి? యీ రావణుఁడు మ్రందునే?”యనువారు; “232నరనాథుఁడీతని నమ్మునే యచటి కరిగిన.”ననువార లగుచు నుండంగ |