ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
విభీషణ శరణాగతి
నంత విభీషణుఁడాకాశవీథి
సంతసంబున మంత్రిజనులతో 233ఁగూడి[వా.రా. సర్గ 17]
వచ్చుట గనుఁగొని వనచరులెల్ల
నచ్చెరువడి చూచిరటు తలలెత్తి
రెత్తినరాముచే నింద్రారి యింక
నెత్తఁడు తలలు;234పేటెత్తుఁదత్కులము;
నెత్తెడుభయముఁబోనిడి సురలార,
యెత్తుఁడాత్మలఁ; దలలెత్తు డన్మాడ్కి.235
నప్పుడు సుగ్రీవుఁడగచరాధిపులఁ
దప్పక కనుఁగొని తగవారి కనియె:
“వనచరులార! యీ వచ్చు రాక్షసునిఁ
గనుఁగొనుఁ236డదె వీఁడఖండవిక్రముఁడు,
ఘనమైన పర్వతాకారంబువాఁడు,
237తనరార శస్త్రముల్‌ దాల్చినవాఁడు,
మిక్కిలి 238పొడవున మెఱసినవాఁడు239
స్రుక్కక యిట వచ్చుచున్నాఁడు వీఁడు.”
అనవుడుఁగడఁగి యయ్యగచరాధిపులు
ఘనమైనగిరులు వృక్షములు సేపట్టి
“మముఁబంపుసుగ్రీవ! మముఁబంపు దేవ!
సమరంబులో దైత్యుఁజంపెద.”మనుడు
నా విభీషణుఁడనె: “నగచరులార!
మీవాఁడ; నిటు సంభ్రమింపంగ వలదు;
రావణుతమ్ముఁడ! రాక్షసోత్తముఁడ!
భావింప నేను నిష్పాపమానసుఁడ!
శరణని యా రామజనపాలుఁగాన
నరుగుదెంచినవాఁడ నా లంకనుండి
రావణుతో నేను: “రామభూపాలు
దేవి ని.”మ్మని పెక్కు తెఱఁగుల నంటి.
ననవుడు నామాట కతఁడు గోపించి
తన సభలోపలఁదన్నె నన్‌240బట్టి.
తన్ని యంతటఁబోక తన వీటిలోన
నున్నఁజంపెద నని241యోట లే కాడె.
నేనును వెలువడి యీ రామచంద్రుఁ
గానంగ వచ్చితిఁ; గాని చింతింపఁ
గపటుండఁగాను; నిష్కపటమానసుఁడఁ
గపులార! 242నా యెడఁగపటం బులేదు.
సభయుండనగు నాకు సంప్రీతి వెలయ
నభయ మిప్పింపుఁడీ యవనీశుచేత.”
ననవుడు సుగ్రీవుఁడా రాముఁ243ఁగానఁ
జని విన్నపము సేసె సవినయండగుచు:
“రావణుతో244నల్గి రాయిడి వుట్టి
దేవ! వీఁడొక్కఁడేతెంచియున్నాఁడు;
మొత్తంబుతో నభంబున నున్నవాఁడు;
చిత్తంబు మీ మీఁదఁ జేర్చియున్నాఁడు;
“అమరారితమ్ముఁడ”ననుచున్నవాఁడు;
విమలవాక్యంబుల వెలసినవాఁడు;
“245ఆదిత్యకులనాథ! యభయ మి”మ్మనుచు
మోదవాక్యంబుల మొనసినవాఁడు.
మీ కృపకలిమి యెమ్మెయి నున్నయదియొ?
నాకుఁజూడఁగ వీని నమ్మంగరాదు.
నరనాథ! కపటంబునకుఁబుట్టినిల్లు
లరయ రాక్షసులుగా కన్యులు గలరె?
దనుజాధినాథుని తమ్ముండేమిటికిఁ
జనుదెంచు? నిన్నీచుఁజంపఁగావలయు.
ననుడు నంతటిలోన నాంజనేయుండు
వినయసంభరితుఁడై విభున కిట్లనియె:

  1. ↑నెగసి
  2. ↑పేడెత్తె నన్మాడ్కి
  3. ↑నెత్తిన
  4. ↑డా
  5. ↑ధనురారి
  6. ↑సేనతో
  7. ↑నిక్కంపుఁజుట్టమై నెఱి వచ్చువాఁడు, మక్కువ నలువురు మంత్రులుఁ దాను - స్రుక్కక…
  8. ↑బెట్టు, నిట్టు
  9. ↑యోటిల్ల
  10. ↑మీ… లేల
  11. ↑కడకు
  12. ↑నేఁడు
  13. ↑అధినాథ, యభయ మిమ్మనుచున్నవాఁడు-మధురవాక్యంబుల మానైనవాఁడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )