ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
సారణుఁడు పేర్పేర వానరవీరుల రావణుని కెఱిఁగించుట
“దేవ! పుళింద440 నదీతీరవర్తి
పావకసుతుఁడైన ప్రబలుఁడీ ధాత్రి
వీఁడె యీ లంకెల్ల వెసఁబెల్లగించెఁ
బోఁడిగా నార్పులు బొబ్బలు సెలఁగ.
గురుతరకపినాయకులు లక్ష గొలువఁ
దరుచరసేన ముందఱ నున్నవాఁడు
అలఘుసత్త్వుఁడు నీలుఁడనువాఁడు దేవ!
జలజాప్తసుతునకు సైన్యపాలకుఁడు.
వీఁకతో దిక్కులు వెసఁబెల్లగిల్లఁ
దోఁకఁదాటించుచు దుర్దమవృత్తి
వెఱఁగందఁజేయుచు వేయు పద్మములు
మఱి నూఱుశంఖముల్‌ మర్కటోత్తములు
441బలవంతులగువారు బలసి తన్‌గొలువ
గొలువున్న వాఁడొక్కకొండయుఁబోలి
వాలినందనుఁడల్లవాఁడె యంగదుండు;
వాలికంటెను బలవంతుండు వాఁడు.
అడరిన యా చందనాద్రి వల్లభుఁడు
కడుఁబ్రసిద్ధుఁడు విశ్వకర్మనందనుఁడు
విను ప్లవంగంబులు వేయుఁగోటులును
నెనుబదిలక్షలు నేపారి కొలువ
ఘనమైన సేతువుఁగడఁకతోఁగట్టి
వనచరసేన నివ్వలకు దాటించి
వాలిననలుఁడువో వాఁడు దైత్యేంద్ర!
వాలినందనున కవ్వల నున్నవాఁడు
తరుచరయూధముల్‌ తనుఁబెక్కు గొలువ
సురలోకకంటక! 442శూరు443డౌవాఁడు.
తన సేనతోఁగూడి తా నొక్కరుండ
మనలంక సాధింప మండుచున్నాడు;
రజనీచరాధీశ! రమణీయకాంతి
రజతాద్రిఁబోలుచు రవిపుత్త్రునెదుర
బలములన్నింటిని బరిపాటిఁదీర్చు
వలఁతి; యా శ్వేతుఁడన్‌ వానరుఁజూడు.
గురుబలాఢ్యులు వేయుఁగోటులు గొలువ
వఱలు నాతఁడు వేగవంతు డన్‌వాఁడు
చూడుమా మనదిక్కు సూచుచున్నాఁడు
చూడుమా లంకేంద్ర! సుగ్రీవసఖునిఁ.
దగువింధ్య సహ్య సుదర్శనముఖ్య
నగములకెల్లను నాథుండు వాఁడు.
కొమరారుసింగంపుఁగొదమయుఁబోలె
నమరినవాఁడు లంకాధీశ! వినుము.
గాంభీర్యవారిధి కపిలవర్ణుండు
రంభుండు ఘనకేసరంబులవాఁడు
బలువిడి నూటముప్పదిలక్ష లెలమిఁ
గొలువ నున్నాఁడదిగో దేవ! చూడు.
కుముదుఁడన్‌వాఁడు444 సంకోచనాచలము
నమరంగఁబాలించు నమరారి; యతఁడు
పదికోట్లయగచరపతు లోలిఁగొలువ
మదమున మలయు నా మర్కటుఁజూడు.
445రమ్యశైలమునకు రాజైనవాఁడు
రమ్యోరువిస్తృతోరస్‌స్థలుం డతఁడు
నలువది446లక్షలు నాలుగువేలు
గొలువంగ లంకపైఁగోపంబు మీఱఁ
గుదియక యిరుగెలంకులఁజూచువాఁడు
త్రిదశారి! యదె చూచితే శరభుండు.
బలసి తన్నెపుడు నేఁబది447లక్షకపులు
గొలువ నున్నతనిఁగన్గొను మల్లవాఁడె
పారియాత్రాచలపతి ఘోరసమర
ధీరుండు పనసుండు దేవారి! యతఁడు.
లలినొప్ప నఱువదిలక్షలకపులు
గొలువ నున్నాఁడదె గురుసత్త్వధనుడు
సిందూరపుంజాయఁజెలు వగ్గలించి
యందమై క్రోధనుం448డనువాఁడు దేవ!
“యేనె చాలుదు లంక నిలఁ గూలఁ ద్రోయఁ
గా.” నని పూని యిక్కడఁజూచువాఁడు.
బలవంతులగు కపిపతులు దన్నెపుడు
లలి నొప్ప డెబ్బదిలక్షలు గొలువ
గవయుఁడన్‌వాఁడదె కనుఁగొను దేవ!
వివిధ ప్రతాపసంవృతుఁడైనవాఁడు.
కామరూపులు వీరు ఘనఘోర449సత్త్వు
లీ మెయి ననిలోన నెక్కుడౌవారు;
తలపోయఁగా దేవదైత్యులకైనఁ
450గలఁగనివారు; ముంగలివారు వీరు.
నడుమనెప్పుడును సేనాసమేతముగ
నడతెంచువారి దానవనాథ! వినుము:
ఉరుభుజుల్‌ వివిధవర్ణోజ్జ్వలు లద్రి
చరులు నానాసహస్రంబులు గొలువ
నీ తోడ నెక్కటి నెఱిఁబోరఁదివుఱు
నాతండు451హరుఁడు దేవారి! కన్గొనుము.
నలు వెంతయును మీఱి నానా విధముల
నెలుఁగు లసంఖ్యంబు లేపారి కొలువ
నతినీల మేఘమధ్యస్థుఁడై పొలుచు
శతమఖుఁబోలి యుజ్జ్వలుఁడైనవాఁడు
నర్మదాతీరంబునను ఋక్షనగముఁ
బేర్మితో నేలెడు పృథుబాహుబలుఁడు
వాఁడె ధూమ్రుఁడు జాంబవంతు తమ్ముండు
వాఁడిమి మగఁటిమి వాలినవాఁడు.
నీలశైలంబుల నిలువెల్లఁ దార
యై లీల నొప్పెడు నాకృతుల్‌ గలిగి
యుల్లసిల్లుచునున్న యొకకోటిసంఖ్య
భల్లూకములు గొల్వ బలసియున్నాఁడు
తొల్లి దేవాసురోద్ధుర 452యుద్ధకేళి
నెల్లవరంబులు నింద్రుచేఁ బడసి
వాలిన యా జాంబవంతుండు వాఁడె
తూల453ఁడు రణములో ధూర్జటికైన.
నుక్కలుం454డదె వీని యుభయపార్శ్వము455లు
నొక్కొక్కయోజనం456బొ457డలంతపొడవు;
458నలిఁబద్మసంఖ్యవానరసేన గొలువ
సలలితుండగువాఁడు సన్నాదనుండు;
నాకారి! 459బిరుదు వానరపితామహుఁడు
నాకీశుతోఁబోరి నలి గెల్చినాఁడు.
దహనునివలన గంధర్వకన్యకకు
మహనీయమైన జన్మంబును బొంది
పరపైన యా ద్రోణపర్వతంబేలుఁ
దిరముగా జంబునదీతీరవర్తి
వేయుఁగోటులు కపివిభులు దన్‌ గొలువ
460నీ యగచరుఁజూడు మేచినవాఁడు
నీలుని తమ్ముఁడు నిర్జరవైరి!
చాలువాఁడతఁడింద్ర461జాలుఁడన్‌వాఁడు.
కుపితమర్కటులు వేగోటులు గొల్వఁ
గపివీరుఁడదె చూడు క్రథనుఁడన్‌వాఁడు.
కరము సంప్రీతి గంగాతీరమునను
జరియించువాఁడు శాశ్వత 462బాహుబలుఁడు
చిర463తరలీలమై శిశిరాద్రి వేడ్క
నిరవంద నెప్పుడు నేలెడువాఁడు
పదికోట్లయగ 464చరుల్‌ బలసి తన్‌ గొలువ
నదె చూడుమా గజుఁడనువాఁడు దేవ!
కోటికోటుల 465వేలు కొమరారుజముని
పాటిగోలాంగూల466పతులు దన్‌ గొలువ
నదె గవాక్షుండను నతఁడాలమునకుఁ
ద్రిదశారి! యౌడులు467దీడుచున్నాఁడు.
ధవళవర్ణాంగు లుద్దండవిక్రములు
రవిసన్నిభులు రణరంగభీషణులు
వివిధరూపంబుల విఖ్యాతులైన
ప్లవగ468ముఖ్యులు దనుఁబదివేలు గొలువ
నున్న కేసరిఁజూడు మొప్పారు కాంచ
నోన్నత 469గిరులకు నొడయండు వాఁడు.
బహువర్ణులై పటుభాషణధ్వనుల
మహి470యగల్చుచు దంతమండలి వెలుఁగ
సింగంపుఁగొదమల471చెన్నగ్గలించి
పింగళాక్షంబులఁబెద్దయు నొప్పి
వేయుఁగోటులకపుల్‌ వేడ్కతోఁగొలువఁ
బాయక రామకృపారసం బంది
తన ప్రాణములు రామధరణీశ్వరునకు
ననయంబు నీఁగోరు నతులవిక్రముఁడు
అమరారి! వాఁడె యత్యాయతబలుఁడు
సమర472కర్కశుఁడైన శతబలి చూడు.
వీఁడె సుషేణుండు వేగోట్లకపులు
వాఁడిమిఁ473ద474నయట్టివారు దన్‌ గొలువ
నున్నవాఁడదె చూడు మో దేవ! సమర
సన్నద్ధుఁడై వెక్కసంబైన కడిమిఁ.
బదికోట్లయగచరపతు లోలిఁగొలువ
నొదవు నా కపివీరుఁడుల్కాముఖుండు.
ఇటుచూడు 475మా వీఁడె ఋషభుఁడన్‌వాడు
భటముఖ్యులతనికిఁ బదికోటులధిప!
వనచరశతకోటి476వాఁడల్లవాఁడె
ఘనభుజస్కంధుండు గంధమాదనుఁడు.477
విను మిరువదియొక్కవేయు శంఖంబు
లును మఱి రెండువేల్‌ నూఱుబృందములుఁ
గల యల్లమొన దివాకరసూనుమూల
బల; మావలీముఖప్రముఖులు వేడ్క
లొలయఁగిష్కింధలో నుండెడువారు;
లలి దేవగంధర్వులకుఁబుట్టినారు;
కామరూపముల సంగరకౌతుకముల478ఁ
దా మిగిలినవారు దశకంఠ! చూడు.
మమృతంబు బ్రహ్మచే నమరంగఁబడసి
రమరులకంటెను నధికులు చూడు;
వినుతింప మైందద్వివిదులనువారు.
విను దేవ! యేకాంగవీరులు వారు
పది479వేలకోటులు ప్లవగులు గొలువ
నుదధితీరంబున నున్నారు వారు
వీరులు సుముఖుండు విముఖుండు ననఁగ
ఘోరవిక్రములు గన్గొనుము లంకేంద్ర!
మృత్యువుకొడుకులు మిక్కిలిచేవ
మృత్యువుకంటెను మీఱినవారు.
మిగిలిన480చేవతో మితి మేర లేని
యగచరుల్‌ దను భృత్యులై కొలువంగ
నున్నవాఁడదె చూడు ముదధి లంఘించి
నిన్ను నీ బలమును నీ వారిఁగొనక
చనుదెంచి వనములో జానకిఁగాంచి
వనమెల్లఁబెఱికి నీ వరసుతుఁజంపి
లంక భస్మము సేసి లంకిణి నొంచి
జంకెతోఁగ్రమ్మఱఁజన్నవాఁడతఁడు.
ఆ వాయుసూనుండు హనుమంతుఁడగుట
నీవును నెఱుఁగుదు నిర్జరారాతి.
విను చిత్ర మొక్కటి: వీఁడు బాల్యమున
నినమండలంబుదయింపంగఁ జూచి
పెరిగినయాకటిపెల్లున దానిఁ
బరికించి ఫల481మని పట్టంగఁదివిఱి
వేగంబుతో 482మూఁడువేల యోజనము
లా గగనంబున కప్డు బిట్టెగసి
యంతటనుండి పూర్వాద్రిపైఁబడియె
నెంతయు రయమున; నీ వానరునకు
హనువు భగ్నంబయ్యె; నంతనుండియును
హనుమంతుఁడను నామమయ్యె నీతనికి.
వీరలందఱును బృథ్వీతలంబెల్ల
వారక యొక్కింత వడి గెల్చువార.
లిట్టికపీంద్రులనేకులు దేవ!
483యెట్టని సంఖ్య దా నెన్నంగవచ్చు?”
నని సారణుఁడు వల్క నసురేంద్రుఁజూచి
సునిశితమతియైన శుకుఁడర్థిఁబలికె:
“వారలకెల్ల జీవనమైనయట్టి
యా రాముఁజెప్పెద నసురేశ వినుము:
నయ484రీతి నీలరత్నప్రభాభాతి
మెయిచాయ నెంతయు మెఱసినవాఁడుఁ,
గమలంబులనుబోలుకన్నులవాఁడు!
విమలసత్కీర్తిచే వెలసినవాఁడు,
సత్యంబులోపలి సారమౌవాఁడు,
నిత్యధర్మంబున నెగడినవాఁడు,
శస్త్రాస్త్రవిద్యావిశారదుం, డఖిల
శాస్త్రజ్ఞుఁ, డురుకీర్తి సంపదవాఁడు.
దపనునినైనను దమతాత యనక
తపియింపఁజేయు ప్రతాపంబు వాఁడుఁ;
జక్కాడు నభమైన శరజాలములను;
వ్రక్కలుగాఁజేయు వసుమతినైన;
నలిగిన నాతనియలుక వైరులకుఁ
దలపంగ మృత్యువు దశకంఠ! వినుము.
తెగువ నీవా సీతఁదెచ్చితిగాన
జగతీశుఁడిబ్భంగిఁ జనుదెంచె ననికి.
వరశరణాగతవజ్రపంజరుఁడు,
బిరుదులకెల్లను బిరుదైనవాఁడు,
శరణన్నఁ485గాని యే చందంబులందు
దొరకొన్న నలుకకుఁ దుదలేనివాఁడు,
మిక్కిలియైన నీ మీఁదికోపమున
నక్కన్ను486లందెఱ్ఱ యమరినవాఁడు,
మూఁడులోకంబులిమ్ముల నేలువాఁడు,
వాఁడెపో రాముఁడు వనజాప్తకులుఁడు.
వారక శుద్ధసువర్ణవర్ణాంగుఁ,
డా రామువలపట నట యున్నవాఁడుఁ,
జలమున నీ రేడుజగములనైన
నలుకతో నిర్జింతు నను శక్తివాఁడు,
నా రామునకుఁబ్రాణమైనట్టివాఁడు,
నా రాముతమ్ముఁ, డుదగ్రవిక్రముఁడు,
భావింప487నమ్మేర్చి పట్టినవాఁడు
దేవ! యా లక్ష్మణ488దేవరఁజూడు.
మలుకమై నిన్ను నుగ్రాజి489లో గెలిచి
చలమొప్ప లంక నిశ్శంక నేలుటకుఁ
బట్టంబు రామభూపాలునిచేతఁ
గట్టించుకొని ప్రీతిఁగ్రాలుచున్నాఁడు,
మహనీయ490వరధర్మమార్గంబువాఁడు,
మహితనీతిస్థితి మరగినవాఁడు,
నా విభీషణుఁజూడు మసురాధినాథ!
491భూవరు492వెనుక 493నేర్పున నున్నవాఁడు.
ఆ రాముతమ్ముని యా విభీషణుని
చేరువ నవ్వలఁజేరియున్నాఁడు,
మానగుణా494ధీన మతి నొప్పువాఁడు,
బూని కిష్కింధ495యెప్పుడు నేలువాఁడు
496మహనీయలక్ష్మీసమగ్రతతోడి
మహిమతోఁబసిఁడితో మాలఁగొన్నాఁడు
గురుభుజు, డత్యంత ఘోరవిక్రముఁడు,
సురవైరి! చూచితే సుగ్రీవుఁడతఁడు.
వీనికిఁగలసేన వివరంబు వినుము
దానవనాథ! చిత్తంబునఁదెలియ:
సంఖ్యలు వెయిగోట్లు చన నూఱువేల
సంఖ్యలు నమ్మహా497శంఖునాఁబరగు;498
నవిలక్షగూడ మహాబృంద మయ్యె;
నవి లక్ష గూడిన నగుఁబద్మసంఖ్య;
యవి లక్ష గూడ మహాపద్మమయ్యె,
నవి లక్షగూడిన నగు ఖర్వగణన;
యవి లక్షగూడ మహాఖర్వ మయ్యె;
నవి లక్షగూడిన నగు సముద్రంబు;
నవి లక్షగూడ మహా499భూరి యందు;
రవి లక్షతో500మహౌఘాఖ్యమై పరగు;
నవి కోటివో వాలియనుజన్ముబలము
వివరించి చూడుము విశదంబుఁగాఁగ.
నిది తుద మొదలని యెన్నంగరాదు
చదురుఁదనంబున సంఖ్య దేరాదు.
కావున రాముతోఁగదిసి పోరాడ
రావణ! 501రాదు దుర్వార మా బలము.”
అని శుకుఁడెఱిఁగింప నా రావణుండు
ఘనమైన కపిసేనఁగలయంగఁజూచి[వా.రా. సర్గ 29-31]
తనలోన బడబాగ్ని దరికొనుచుండఁ
దనరారు వార్ధిచందంబున 502నపుడు
వెఱచియుఁదనలోని వెఱ పణఁగించి
వెఱవని503గతిఁ గోపవివశుఁడై పలికె:
“మంత్రి యేలికచిత్తమార్గంబు 504విడిచి
మంత్రంబుఁజెప్పునే మనసెల్ల విఱుగ?
నే తెఱంగెఱుఁగక యెదిరి నా యెదర
నీ తెఱంగునఁబల్కుటిది505మీకుఁదగునె?”
యనవుడుఁదలలెత్త కచ్చోట వాసి
చనిరి భీతిలి శుకసారణు లంతఁ.
జనినపిమ్మట 506నాప్త 507సచివులుఁదాను
దనుజాధినాథుఁడెంతయును జింతించి
వారి వీడ్కొల్పి దుర్వారుఁడై వైర
మార విద్యుజ్జిహ్వుఁడనువానిఁబిలిచి:

  1. ↑దా
  2. ↑నలిఁబద్మసంఖ్య వానర సేనగొల్వ
  3. ↑సుతరుఁడన్వాడు
  4. ↑డై
  5. ↑(నామ్నాసంరోచనోనామ నానానగయుతో గిరిః, తత్రరాజ్యం ప్రశాస్త్యేష కుముదోనామ యూధపః, సం)
  6. ↑(రమ్యం సాల్వేయపర్వతమ్‌. సం)
  7. ↑కోటులు నాల్గులక్షలును. (రాజ్య శతసహస్రాణి చత్వారింశ త్తధైవచ. సం. - ఏఁబది, లక్షలు యూధపులు గొలువ. భా.రా.)
  8. ↑కోట్ల
  9. ↑డటుచూడు దేవ
  10. ↑మూర్తు
  11. ↑దలఁ… దఱివారు
  12. ↑హరుఁడను నగ చరోత్తముఁడు
  13. ↑సంగరమున
  14. ↑ఁడెన్నడు రణధూమ్రలోచనుఁడు
  15. ↑డగు
  16. ↑ల
  17. ↑బొగి మీఱియుండు
  18. ↑డలిలోఁబొడవు
  19. ↑గల పద్మసంఖ్యలకపులును, నలిఁబద్మకోటివానరులును
  20. ↑వీఁడు
  21. ↑నాయతభుజుఁడైన యగచరుఁజూడు
  22. ↑జాను
  23. ↑బలాన్వితుఁడు
  24. ↑వృత్తి తోడను శిశిరాద్రియందు
  25. ↑చరపతులు తన్‌
  26. ↑లు వేయు
  27. ↑బలములు గొలువ
  28. ↑తీ(దీ)టు
  29. ↑సమూహంబు బలసి తన్‌ గొల్వ
  30. ↑శిఖరికి
  31. ↑యగల్పఁగ గండ
  32. ↑చెలువున నొంది
  33. ↑విక్రము
  34. ↑గల
  35. ↑న్నుఁగొల్వఁగ నున్నవాఁడు - పదికోట్ల…
  36. ↑మమ్మేటి
  37. ↑వలనొప్పఁగొలువఁ- దనరునాతనిఁజూడు దానవాధీశ! కనకాద్రిధైర్యుఁడఖండవిక్రముఁడు- ఘన…
  38. ↑మొనకు వేకోట్లుగా ముయ్యేడు మొనలు- దనరఁగల్గినవాఁడు దధిముఖుఁజూడు (డధిప)-విను మిరు…
  39. ↑భీమవిక్రమములఁబెంపారువారు ర, లనికి సన్నద్ధులై యార్చుచున్నారు- కనుఁగొను వారిరాక్షస లోకనాథ!
  40. ↑కోట్లప్లవగులు బలసి తన్‌
  41. ↑తెగువతో
  42. ↑బుద్ధిఁబ
  43. ↑నేడు
  44. ↑యిట్టని… నెన్నంగరాదు
  45. ↑మైన
  46. ↑గాచునే
  47. ↑లెఱ్ఱనై
  48. ↑మమ్మేచి
  49. ↑దేవుని
  50. ↑ఁదున్మించి
  51. ↑తర
  52. ↑భూవిభు
  53. ↑క్రేవ
  54. ↑పెంపున
  55. ↑ధిక
  56. ↑యేపున
  57. ↑చిరకపి రాజ్యాభిషేచనహేతు - కర హేమమాలికా కలిత వక్షుండు
  58. ↑సంఖ్యన, (శతంకోటి సహస్రాణాం శంకు రిత్యభిధీయతే- సం శంఖము - భా.రా)
  59. ↑నవిలక్షగూడిన నగుబృంద సంఖ్య - యని…
  60. ↑సముద్రంబు -న
  61. ↑మహదాఖ్యనాఁబ, గూడ నాఖ్యమై యొప్పు
  62. ↑కాదు
  63. ↑నతఁడు
  64. ↑క్రియరోష
  65. ↑దప్పి
  66. ↑నీతి యగునె?
  67. ↑నాత్మ
  68. ↑జనులును
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )