ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
యుద్ధభూమి వర్ణన
727నెక్కటికయ్యంబు728లిటు చెల్లుచుండఁ
దక్కక విఱిగిన తఱచైనవిండ్లఁ
జిదిసిన శరములఁజిద్రుపలై పడిన
గదలను దునిసిన కరవాలములను
మురిసిన శక్తుల ముద్గరంబులను
బరిసిన పరిఘలఁబట్టిసంబులను
గడికండలైన చక్రప్రాసములను
బొడియైన సురియల భూరిశూలములఁ
729దుమురులై పడియున్న తోమరంబులను
రమణఁజూర్ణంబైన రథచక్రములను
గూలి పెల్లుగఁదన్నుకొను ఘోటకముల
వ్రాలి మన్గఱచిన రథచోదకులను
(నేదిక్కు చూచిన నింతనరాక
ప్రోదియై పడియున్న భూషణంబులను)
రాలిన కోటీర రత్నపుంజముల
నేలఁబట్టిన బాహునిచయఖండములఁ
జచ్చిన యసురుల సమరభూభాగ
మచ్చెరువై యుండె. నప్పుడు చూడ
మర్దితారాతి రామక్షితీశ్వరుఁడు
దుర్దాంతశరములఁద్రుళ్లడంచుటయు
మలగొన్న యురుమీనమకరోరగాది
జలచరంబులు సిక్క జలమెల్లనిగిరి
వశగతంబై రామవల్లభు నెదురఁ
గృశమైనయంబుధి క్రియనుండె రణము.
నట్టివిధంబున నవనిజఁదెచ్చి
నట్టిరావణునకు నట్టపై శిరము
లట్టేల నిలుచు నన్నట్టిచందమున
నట్ట లాకసమునందాడంగఁదొడఁగె.
నెఱిగల్గుమజ్జంబు నెఱసిన రొంపి,
తఱచైన వెండ్రుకతండంబు నాఁచుఁ,
బునుకలు చిప్పలుఁ, బొరిఁబొరినున్న
ఘనమైనపలకలు కమఠతండములుఁ,
దుమురులై పడిన కైదువులు మీనములు,
రమణీయతరచామరములు హంసములుఁ
గొమరారు తెల్లనిగొడగులు నురువు,
నమరుభూషణచూర్ణ మందలి యిసుక,
యొడ్డనంబులు నెగ,ళ్లురుదంతిశవము
లొడ్డిపెంపారిన యొడ్డైన గిరులుఁ,
దరుచరాసుర దేహతతులు వృక్షములుఁ,
దొరిగిన ప్రేవులు దుష్టసర్పములుఁ,
గొఱప్రాణములతోడఁ గుంభిని730యందు
నొఱగినరాక్షసు లొఱలుట మ్రోఁత,
గలగొన్న731ఘనతురంగములు గ్రాహములు,
నలిఁదూలుపడగలున్నతినందుఁతెరలు.
నివ్విధంబున మీఱి యేఱులనెల్ల
నవ్వుచుఁబటురక్తనది యుబ్బి పాఱె.
నారయఁబాపాత్ముఁ డగుఁగాక, యేమి?
యా రామునకు ద్రోహియగుఁగాక, యేమి?
యతిలోకకంటకుం డగుఁగాక, యేమి?
యతఁడు నీచాత్ముకుం డగుఁగాక, యేమి?
యతులఁజంపినపాపి యగుఁగాక, యేమి?
సతులఁజంపినదురాసదుఁడు గా,కేమి?
యేఁగదా యీ దేహ మిట విడిపించి
లోఁగొని వాని నా లోపల ముంచి
ఖలుఁడైనయట్టి యుక్కలుని రావణునిఁ
బొలుపార ముక్తికిఁబుత్తు నన్మాడ్కి
సంగతి నొప్పారు జాహ్నవి యనఁగ
సంగరస్థలి మహాశ్చర్యమై యొప్పె.
నప్పుడు లంకలో నా దైత్యకాంత
లుప్పొంగుశోకపయోధిలో మునిఁగి:
“గ్రద్దనఁజేయు నా కయ్యంబు దక్కి
ప్రొద్దుగ్రుంకినఁగాని పోఁడు రాఘవుఁడు;
ఎప్పుడు గ్రుంకునో యినుఁడింక.”ననుచు
నప్పటకప్పటికి బిట్ట 732రయుచునుండ
‘నంచిత క733ఠినపుంఖా734స్త్రాంశుసమితి
ముంచి రావణుని తమోగుణం బణఁప
భీమప్రతాపసంస్ఫీతుఁడైయున్న
రాముఁడే చాలు దుర్వారుఁ’డన్మాడ్కి
ఘనతరంబగు తనకరములు మోడ్చి
వనజాప్తుఁడపరదిగ్వనధిలో మునిఁగె.[వా.రా. సర్గ 44]
ఖలుఁడైన యా దశకంఠునిచేటుఁ
దెలుపుటకై 735 నిశీథిని కచభరము
విరళమై జల్లన విరిసెనో యనఁగఁ
బరపొంది చీకటి ప్రబలమై పర్వె.
నప్పుడు బొబ్బలు నార్పులు బెట్టు
చప్పుళ్లు మల్లలు సఱచు736బేడిదము
లట్టహాసంబులు నడరి యొండొరులఁ
దిట్టెడు?నెలుఁగులు దీర్ఘహుంకృతులు
ఝంకారరవములుఁ జప్పరించుటలు
నంకించుపలుకులు నాహ్వానములును
రథనేమి రవములు రథికసారథుల
పృథులవాక్యోద్భూత భీమనాదములు
గుణనిస్స్వనంబులుఁగుంజరాంగముల
ఘణిఘణిల్లని మ్రోయు ఘంటాస్వనములుఁ
గరిబృంహితంబులు ఘనతూర్యరవముఁ
దురగోగ్రహేషలుఁదోరమై నిగుడఁ
బ్రొద్దుగ్రుంకిననైనఁ 737బోవక చలము
పెద్దయై కపులును బేర్చి రాక్షసులు
నతిభయంకరమైన యని సేయునప్పు
డతినిబిడంబైన యంధకారమునఁ
“బొడు,పొడు,పొడు;పోకు,పోకుఁ;డన్మాట
విడు,విడు; వ్రేయు,వ్రేయుఁ;డన్మాట
చలము డింపక చంపు, చంపుఁ;డన్మాట
తొలఁగక తలద్రుంపు, త్రుంపుఁ;డన్మాట
యెందున్న వాఁ?డేఁడి? యేఁడి?యన్మాట
యిందు రానిమ్ము, రాని;మ్మనుమాట
యటమీఁద హుంకృతుల్‌ హాసముల్‌సెలఁగ
నిటు సెల్లుమాట738ల నిక్కువ లెఱిఁగి
పోరుచోఁ గెంధూళి బోరన నెగయఁ
బేరి యా చీకటి పెద్ద యౌటయును
బ్రమయుటఁజేసి యేర్పఱుపంగరాక
తమతమవారలఁదామె చంపుదురు.
కోపించి వానరకోటులు గవిసి
యా పాపకర్ముల నసురులఁగిట్టి
రథికులఁజంపి సారథులఁజెండాడి
పృథులరథ్యంబుల పీఁచంబు లణఁచి
కడునొగ లలమి మ్రొగ్గగఁదేరు లెత్తి
యడుతురు నుగ్గునూచై నేలఁగూలఁ;
దుమురుగా జోదుల త్రుళ్లడఁగించి
సమదవారణముల చరణంబులెత్తి
యిరుగేల నమరించి యేచి తాటించి
వరుస నల్లటు పాఱవైతురు చంపి;
చిదురలై దెసలందుఁజెదర గుఱ్ఱములఁ
గదిసి తోఁకలతోడఁగడకాళు లొడిసి
పట్టి బెట్టుగఁద్రిప్పి పడవైతు రెలమి
నెట్టన739నేలఁబెత్తురు లొలుకఁ;
గోలెమ్ము లురములు గుండెలు బరులు
వాలినభుజములు వదనదంష్ట్రములుఁ
బునుకలు మెదడును భువిమీఁదఁ జెదరఁ
గనుకనిఁగాల్వురఁగడఁగి చంపుదురు.
అరదాలపెల్లున నడరు ధూళియును
దురగఖురోద్ధూత ధూళియు740నెగసి
దానవానీకంబు తలఁపులో నున్న
కానమి యెల్ల741ను గ్రమ్మి వెల్విరిసె
ననఁగఁజీకటి కూడి యగ్గలంబగుచు
వినువీథి742నడుమెల్ల విపులమై నిండె.
నసురుల యసువులు నగచరాధిపుల
యసువులు నొక్కట నపహరించుటకు
నా మెయి నా రాత్రి యసురేశుచేత
రామునిచేఁగాళరాత్రియై తోచెఁ.
దమ వేళయగుటయు దైత్యులందంద
743గుమిగూడి ముట్టి త్రికూటాచలంబు
తమ యార్పులకుఁబ్రతిధ్వను లిచ్చుచుండ
సమరసన్నద్ధులై సరభసవృత్తి
మిగిలి యా రాఘవుమీఁదను గవిసి
గగనంబునిండ మార్గణము లేయుటయు
నా రామవిభుఁడప్పు డగ్ని బాణమునఁ
బేరిన చీకటి పెంపెల్ల నణఁచి
తన్నుఁగిట్టిన మహోదరు మహాపార్శ్వు
సన్నుతబలులైన సారణ శుకుల
నట వజ్రదంష్ట్రు మహాకాయు నేసెఁ
బటువేగమున నాఱుబాణముల్‌ దొడిగి.
744యార్వురు దైత్యులు నవినొవ్వ నాట
745బర్వినభీతిమైఁ బాఱిరి దిశల.
కట యున్న రాక్షసు లా రామవిభుని
పటుబాణశిఖి746 పరంపరలచేఁబడిరి.

  1. ↑అక్కడ
  2. ↑లటుచేయు
  3. ↑దుద లేక విఱిగిన… చదిసిన రథముల సామజంబులను
  4. ↑ఁదెరలి-యొ
  5. ↑కరి
  6. ↑డరు, డలు
  7. ↑నక
  8. ↑స్త్రసంతతుల
  9. ↑దేలి దివి
  10. ↑బెట్టి
  11. ↑బోనీక
  12. ↑లు నెసగె నత్తఱిని
  13. ↑ఁదాఁచి
  14. ↑ఁగవిసి
  15. ↑నొక్కట వెల్లివి
  16. ↑నుడులెల్ల
  17. ↑గుమురులై మెట్టి
  18. ↑యాఱువుర్‌
  19. ↑బాఱిరి విముఖులై బ్రమసి దిక్కులకు - న
  20. ↑శలభంబులైపడిరి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )