| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
యనవుడు రావణు నానతిఁద్రిజట దనుజాంగనలుఁదాను ధరణీతనూజ నెనయఁబుష్పకముపై నెక్కించుకొనుచు జనుదెంచి సంగరస్థలిఁబడియున్న కపులను రామలక్ష్మణులను జూపఁ జపలాక్షియును నట్టిచందంబు సూచి కన్నీరు ధారలై క్రమ్మనందంద విన్ననై776వగఁబొంది విలపింపఁదొడఁగెఁ: “గటకటా! రామ! నీ కార్ముకవిద్య యెటుపాఱె; నీయందె యేర్పడియుండు హరిహరాదులనైన నదలించు నీదు శరములశక్తియు సమసెనే నేఁడు? జామదగ్న్యుని777నైన సరకుగాఁగొనవు ఈ మెయి లావున నీ భువి నీవు! సకలమునీంద్రులు సర్పముల్ నీకుఁ బ్రకటితశయ్యగాఁబలుకుచుండుదురు; అట్టిసర్పంబులే యవనీశ! నిన్నుఁ గట్టంగఁద్రాళ్లునై కవిసెను నేఁడు! లాక్షణికులు నన్ను లక్షించి“సకల లక్షణంబులు మేన లలితంబు లరయ[వా.రా. సర్గ 48] విలసితరేఖారవిందంబు లంఘ్రి తలమునఁగలుగుటఁదరలాయతాక్షి! పట్టాభిషేకంబు పతితోడఁగల్గుఁ; బుట్టుదు778రింపారఁబుత్త్రులు నీకు; నైదువవై యుందు.”వనుమాటలెల్ల నాదిత్యకులజ! నేఁడవి బొంకులయ్యె. “రోలంబకులనీలరుచిశిరోజములు చాలఁజెన్నారెడు; సన్నంబునడుము; గది779యవొండొంటితోఁగరివంకబొమలు; కదిసి యున్నవి వజ్రకాంతి దంతములు; తొగ లింగుకయు లేక తోర780ముల్‌గాక మిగులవట్రువలునై మించు పెందొడలు కరములు నిటలంబుఁ781గన్నులు782మోముఁ జరణముల్ రుచిరలక్షణసమేతములు; వరకాంతి నునుపారి783వట్రువలగుచు సరినొప్పు నఖములు సంగతాంగుళులు; ఏచి వృత్తాకృతి నెనసి క్రిక్కిఱిసి నీచాగ్రమైనది నీ కుచద్వయము; ఉరుతరస్నిగ్ధంబు లురముఁబార్శ్వములు గరమొప్పుచున్నది గంభీరనాభి; కమనీయతర 784దివ్యకాంతిఁజెన్నొంది రమణీయమైనది రమణి! నీ మేను. సౌభాగ్యమున నీకు సరి యెవ్వ!”రనిరి; నా భాగ్యమిట్లయ్యె నరనాథ! నేఁడు. “లలన యీ పది785యాఱులక్షణంబులును గలకాంత లత్యంతకల్యాణవతులు.” అని చెప్పునార్యోక్తులవి యెల్లఁదప్పె; మనుజేశ! నా పుణ్యమహిమగా కిదియుఁ “గెందామరలభంగిఁ గెంజాయ మెఱసి యందంబులై యొప్పు నఱచేతులెన్నఁ; బల్లవారుణకాంతిఁబరగు పాదా786గ్ర పల్లవంబులు సమ787స్పర్శంబులరయ; 788నడు మొప్పు789నెలుఁగొప్పునగు మొగంబొప్పుఁ గడునొప్పు నివి కన్యకాలక్షణములు పరికింప.”నని పల్కుపలుకులు దప్పె; నరనాథ! చూచితే నా నోముఫలము! ధరణీశ! నను జనస్థానంబునందు నురువడిఁగొనిపోవునుగ్రదానవునిఁ బొరిఁబొరి వెద790కి నా పోయినజాడ గరమొప్పఁదెలిసి యా కపిసేనఁగూడి జలనిధి బంధించి చనుదెంచి పిదపఁ791 బొలుపేది గోష్పదంబున792మునింగితివె?793 యారయ నతిఘోరమగుయామ్యశరము వారుణబాణంబు వహ్నిసాయకము నెఱయ బ్రహ్మాస్త్రంబు నెఱిఁబ్రయోగింప మఱచితివే నేఁడు మనుజలోకేశ! పగవాఁడు మీ దృష్టిపథమునఁబడినఁ దెగి నేలఁబడుఁగాక794తిరిగి పోఁగలఁడె! యిది దైవకృతముగా కెల్లచందముల నెదురంగశక్తులే యెవ్వరు నిన్ను! మేఘనాదుఁడు మాయ మెఱసి మిమ్మాజి నీ ఘోరశరముల నిటు గట్టె795ననినఁ గాలంబుఁగడిమిమైఁగడవ నెవ్వరికిఁ బోలునే తలపోయ భూలోకనాథ! హా నాథ! హా వీర! హా రామచంద్ర! యే నాకు శోకింప; నిట నీకు వగవ; నీకుఁబ్రాణములిచ్చి నిర్మలుండైన కాకుత్థ్సమణికి లక్ష్మణునకు వగవ; మనసు గందఁగ నాకు మఱుఁగుచునున్న 796జననికి దుఃఖింప; సతతంబు797నీకుఁ జిత్తంబులోపలఁజింతించుచున్న యత్త కౌసల్యకై యడలెద నధిప! “యెప్పుడు పదునాలుగేఁడులు చనునొ! యెప్పుడు వచ్చునో యిట రాముఁ”డనుచు నీ తెఱంగున నీకు నెదురులు సూచు నీ తల్లియాశలు798నిలిచెనే నేఁడు?”799 |