| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
ననవుడు నింద్రజిత్తా రావణునకు వినయంబుతో మ్రొక్కి వీడ్కొని కదలి వాయువేగముగల వాజులఁ1584బూన్చి యాయితంబయినట్టి యరదంబు నెక్కి శరదభ్ర1585సంభృతశైలంబుకరణి గురుభజుండై వెలిగొడగులనీడ రమణీయకంకణరణితముల్ మొరయ రమణు లిమ్ములఁజామరమ్ములు1586వీవ నొలసి మోమున సంగరోత్సాహలీల దళుకొత్త నేతెంచి తల్లికి మ్రొక్కి జనని దీవింపంగఁజని తన పత్నిఁ దనయుల వీడ్కొని తమ్ములచావుఁ దలపోసి కోపాగ్ని 1587దరికొనఁబేర్చి యలఘుదర్పంబున నయ్యింద్రజిత్తు 1588మానక రోషసమగ్రతతోడ దానవకోటులు1589దవిలి సేవింప ఘనకామరూపముల్ గల మంత్రివరులు తనుఁగొల్వ నుత్తరద్వారంబునందు నద్రులగతిఁదేరు లఱువదికోట్లు భద్రగజంబులు1590పదుమూఁడుకోట్లుఁ దురగంబు లరయంగఁదుద1591నూఱుకోట్లు గురుశక్తి నాల్గేసికొమ్ములకరులు నారయ నొకకోటి యడరి తో నడవ భేరుండములువోలెఁబెంపు వహించి చిలుక1592వన్నెలతోడఁ జెలఁగుగుఱ్ఱములు 1593కొలఁదులై నాలుగుకోటులు నడవ వలుఁద నిస్సాణాదివాద్యముల్ మ్రోయఁ గలనికి వెడలి లంకాపురినుండి తనచు ట్టసంఖ్యమై దైత్యులు గొలువ ఘనతర భీషణాకారంబుతోడ వానరవీర దుర్వారనాదముల మానైన రణమహీమధ్యంబు 1594నందు |