| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నరదంబు డిగి ధీరు1595ఁడై కాచియుండఁ దిరిగిరా దైత్యులఁదెరఁగొప్ప నిలిపి గురుతరవేది త్రికోణమై పెద్ద పరపొంది దక్షిణప్రవణమై 1596యున్న భూరిశ్మశానాగ్ని పొలుపొందఁదెచ్చి ధీరుఁడై వేదిలో దీపింపఁజేసి రక్తవస్త్రంబులు రక్తమాల్యములు రక్తచందన మను1597రక్తుఁడై తాల్చి దండంబు నుపవీతతతియు మౌంజియును నిండుమనంబుతో నెఱయంగఁబూని యలవడ నచట ఖట్వాంగధ్వజంబు నిలిపి కపాలంబు నిష్ఠతో నెక్కి పరగంగఁ గంకాళపరిధి గావించి తిరముగా దక్షిణదిశ స్రుక్‌స్రువమ్ము లినుపపాత్రల నుంచి యేర్పడఁగృష్ణ తనులైనవాని రక్తమును మాంసమును బొరిఁబొరి నవి నిండఁబోసి మౌనంబు ధరియించి యప్పు డధర్వణక్రమము దప్పకయుండ మంత్రము లుచ్చరించి చొప్పడ నపుడు స్రుక్‌స్రువములు వట్టి కమియఁబావకుఁడును గరమొప్పఁదాడి సమిధలుఁదిలలును సర్షపంబులును హోమంబు సేయంగ నురుతరంబగుచు నా మహాధూమ మజాండంబు 1598నిండ నా యగ్నిలోనుండి యప్పుడు వేగ నాయితంబైనట్టి యరదంబు1599 వెడలె. రయమున నుగ్రకరాళకేశములు భయదరూపంబుఁగపాలపాత్రంబుఁ దళతళమను కోఱదౌడలు మెఱయ మలఁగ కార్చుచు నస్థిమాలిక లమర నెఱమంట లొలికెడు నేత్రంబు లొప్ప నుఱక హాసముతోడ నొక కృత్తి వెడలి: “పంపుము పంపు మే పనియైన నన్ను; సొంపారఁజేసెద సురవైరి.!”యనుడు నా కృత్తి 1600నెఱఁగి యింద్రారి శస్త్రములు నా కృత్తిఁగైకొని యాకాశమునకు నరదంబుతోడన యరిగి వానరులఁ దిరిగి యేయుటకు నదృశ్యుఁడై యుండె. నంతట నా రావణాత్మజుసేన యంతయుఁగ్రమ్మఱి యరిగె లంకకును. నట యింద్రజిత్తుండు నా కపిసేనఁ బటుతరశరపరంపరల నొప్పింప వలియఁదాఁకెడు శిలావర్షంబుచేతఁ బలుదెసఁజెడి పాఱుపక్షులో యనఁగ ఛిన్నభిన్నాంగులై చెదరిరి కొంద; ఱున్నతగతి దప్పి 1601యుండిరి కొంద; ఱెసగంగ జేవుఱు టేఱులతోడ వసుమతీధరములు వడిఁగూలుకరణిఁ బడిరి రక్తంబులు పయిపయిఁదొరుగ గుడుసుగా నయ్యెడఁగొందఱుకపులు. అప్పు డా యమ్ముల1602నంధకారంబు గప్పి యెవ్వరి 1603కినిఁగానరా 1604కుండె. నంత వానరవీరు లంతరిక్షమున నంతర్హితుండగు నయ్యింద్రజిత్తుఁ బొడగానఁజాలక భూ నభోంతరము వడి నిండఁబఱతెంచు వాఁడిబాణముల నడుములు దెగువారు; 1605నఱుమైనవారుఁ; గడికండలై నేలఁ గలసినవారుఁ; గడిమిమై నాజికిఁ గైకొన్నతరులు విడిచి యమ్ములు గాఁడ వెసఁజచ్చువారు; నడునెత్తిఁబడు ఘోరనారాచసమితి పుడమితోఁగీలింపఁబొడవులు సెడక నిలువుచచ్చినవారు; నిఖిలాంగకములఁ బలుబాణములు గాఁడఁబడి పొరల్ వారు; మాతంగశవములు మాటుగొన్వారుఁ; జేతుల గిరులెత్తి చేష్టించువారు; దృష్టికిఁ దోపక 1606తిరిగి విన్వీథి దృష్టించి యౌడులు దీటెడువారు; నఖిలాశుగప్రవాహములుపైఁ దొరుగ ముఖసరో1607జములకు1608మురియరాకుండఁ బొంది మీఁదికి నెత్తి భూరి1609సేతువుల చందంబుగాఁబ్రకోష్ఠము లొడ్డువారుఁ; జిచ్చఱపిడుగులచెలువునఁ జదల వచ్చుకోలలు గేల వడిఁ1610ద్రుంచువారు; వాలంపుఁ1611బొడుపుల వాలఘాతములఁ దూలించువారు; నెత్తుటఁదోఁగువారు; ఘోరాంబకంబులు గొనియు ధైర్యంబు లారంగ నిశ్చలులై యుండువారుఁ; బ్రేవులు ప్రోవులై పృథివిపైఁ1612దొరుగ నావులింతలతోడ నధికనిద్రలను గనుమూయువారును; 1613“గడఁగి రామునకు ననిఁబ్రాణ మీఁగంటి.”మని పల్కువారు; “దుర్లక్ష్యుఁడితఁ; డనిఁ దొడరంగ నేఁడు దుర్లభం.”బని బ్రహ్మ దూషించువారు; “బ్రహ్మయిచ్చిన శక్తి1614ఁబది1615లుఁడై వీఁడు బ్రహ్మాండమునఁగానఁబడకున్నవాఁడు బ్రహ్మవరంబెంత? బ్రహ్మాండ మెంత? బ్రహ్మ యెంతటివాఁడు పార్థివేంద్రునకు? దలపోయ ననిలోన ధరణీశుఁడేటి కలుగఁడో?”యనువారు;నై1616యుండ మఱియు: నుద్దండకోదండ మొకచోట మ్రోయు; నుద్దామశరజాల మొకచోట నిగుడు; నొకచోటఁదనుఁ జెప్పు; నొకచోట నార్చు; నొక చోట నదలించు; నొక చోట నవ్వు; నొక చోట హుంకార మొనరించు. నిట్లు సకల 1617భీకరలీలఁజరియింప నలిగి యురుభుజుండాంజనేయుఁడు నంగదుండు శరభుండు ఋషభుండు జాంబవంతుండు గజుఁడు గవాక్షుండు గంధమాదనుఁడు విజయుండు నీలుండు 1618వెస సుషేణుండుఁ బనసుండు మొదలుగాఁబటు పరాక్రములు వనచరులందఱు వడిఁ దరుల్ గిరులు నిగుడి యాకసమెల్ల నిండ వైచుటయు మొగి వచ్చు శరముల మురియలై చెదరి జడియ శతానిలచటులవేగమున నుడుగనిమ్రోఁతతో నురువడి వచ్చి యా శకలములు పై నందంద 1619తొరుగ నాశంబుఁగనిరి వానరులు పెక్కండ్రు; మెఱసినకడిమిమై మేఘనాదుండు నెఱయంగ నిగుడించునిబిడబాణములఁ. గొందఱు తునియలై కూలిరి; భీతి నొంది కొందఱు వాఱి1620రొదిఁగి దిక్కులకుఁ బ్రదరపరంపరల్ పఱపుచు నిట్లు పదికోట్లయగచరపతుల రూపణఁచి వెండియు నెదిరిన వీర వానరుల ఖండించె నతిచండకాండ1621సంతతుల. నతులవిక్రముఁడైన హనుమంతు వాలి సుతు శతబలి గవాక్షుని నీలు నలుని బంధురబలుఁడైన పనసునిఁగుముదు గంధమాదను ఋక్షకపియూధపతుల మఱియుఁగొందఱ నుగ్రమార్గణావళుల నఱిముఱి నిశ్చేష్టులై యుండ నేసి యాదితేయుల గుండె లవియ నమ్మేఘ నాదుండు పటుసింహనాదంబు సేయ మనముల భీతిల్లి మానముల్ దూలి వనచరుల్ దన వెన్క వచ్చి చొచ్చుటయు సౌమిత్రియును రామచంద్రునిఁజూచి: “భూమీశ! యీ మాయపొందున వీఁడు |