| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
గర్వించి యిబ్భంగిఁ గపివీరబలము సర్వంబు సమయింప సమకట్టినాఁడు; 1622మన మింతలో వీని మడియింపవలయు.” ననవుడు శ్రీరాముఁడను1623జన్ముఁజూచి: “విను బ్రహ్మవరమున వినువీథి వీఁడు తనుఁగానకుండ దర్పించినాఁడు; మనమెంత గినిసిన మనకు లోఁబడఁడు; వినుము లక్ష్మణ! నేఁడు వీఁడసాధ్యుండు; అస్త్రంబులేమియు నతనిపైఁగొలుప; వస్త్రముల్ సెడిపోవు.”నని పల్కుచుండ, నా సమయంబున ననిలుండు వచ్చి భాసురమృదువచఃఫణతి నిట్లనియె: “విను వీనిమాయకు వెరవు భూనాథ! తనర నాగ్నేయమంత్రము జపియించి నీవు బాణంబేయ నెఱి దప్పి కృత్తి దేవారిఁబాసి యదృశ్యమై పోవు.” నని యర్థి1624వినిపించి యనిలుండు1625ననఁగ జననాథుఁ డాహవ సంరంభమెసగ మానితంబగు నగ్ని మంత్రపూతంబు గా నమ్ము సంధించు కడఁకతో నేయఁ గృత్తి యత్యద్భుతక్రియ నింద్రజిత్తు నత్తఱి నెడఁబాసి యరిగె నెందేని. నా యింద్రజిత్తుండు నవని1626కేతెంచి యా యెడఁగార్ముకజ్యానాద మమరఁ గడఁగిన నంత నా కపికులోత్తములు నడరిన యా మూర్ఛ లందంద తెలిసి వడిఁగూడుకొని వచ్చి వానిపైఁగవిసి కడిఁదియౌ శైలశృంగమున వాయుజుఁడు, గండశైలముల నంగదుఁడు మైందుండు, దండిమై ఘనపర్వతంబున గజుఁడు, జయమూలమైన వృక్షమున నీలుండు, రయమున నశ్వకర్ణమున నలుండు, నవనీరుహంబున నర్కనందనుఁడు, నవిరళశాఖిని నట పనసుండుఁ, గదిసి యుగ్రంబైన గద విభీషణుఁడుఁ గదురుచు సాలవృక్షమున సంపాతి, భూజమహాశైలముల వలీముఖులు నా జాంబవత్ప్రముఖాది వీరులును, నలి నార్చి మూఁడు బాణముల లక్ష్మణుఁడు గలయంగ నూఱంబకముల రాఘవుఁడు వానిపై నడరింప వాఁడంతపట్టు నానాంబకములఁజూర్ణంబుగా1627ఁజేసి యన1628లోగ్ర ఘోరంబులైన బాణముల వనచరసేనపై వడి1629బెట్టు పఱపి కరలాఘవంబొప్ప గంధమాదనునిఁ బరుషోగ్రశరములఁబదునెనిమిదిట, నేడింట మైందుని, నేడింట ద్వివిదు, నేడింట హనుమంతు, నేడింటఁగుముదు, వడిఁదొమ్మిదింట నవ్వాలినందనునిఁ, గడిమి నన్నియ సాయకంబుల నలుని, నైదింట నీలు, గవాక్షు నేడింట, నాదిత్యనందను నఱువదేనింటఁ, బనసుని1630నిరువది పటుసాయకముల, నెనయంగ దధిముఖు నేడుబాణముల, వసుధేశు1631నేనూఱు వరసాయకముల, నెసగ లక్ష్మణు డెబ్బదేనంబకముల, సాయకత్రయమున శతబలి, నూఱు సాయకంబుల విభీషణుని నొప్పించి మఱియుఁ దక్కినఋక్షమర్కటేశ్వరులఁ గొఱప్రాణములతోడఁగూలనేయుటయు (1632నప్పటి హనుమంతుఁడచలశృంగంబు, నుప్పొంగి యంగదుండురుగండశిలయుఁ బనసవిభీషణుల్ బలుగదల్, బలిమి దనర సంపాతి యుత్తాలతాలమును, నలుఁడు సాలాశ్వకర్ణములు, నందంద నలినాప్తతనయుఁడు నగ1633పరంపరలు, శక్తివిక్రమకళాశాలి నీలుండు శక్తియు, ననలుండు సప్తవర్ణమును, 1634ఖదిరంబు లంది తక్కటిప్లవంగములుఁ బదపడి శతబలి బదరివృక్షమును, సౌమిత్రి మూఁడుగ్రసాయకంబులును, భూమీశుఁడురుశరంబులు నూఱు,వరుస శరభుండు ఋషభుండు జాంబవంతుండు నురుభుజుఁడగు గవయుఁడు సుషేణుండు వెస గవాక్షుఁడు గజద్వివిదమైందులును నసమానవిక్రములైన వానరులుఁ గడు విక్రమంబున ఘనగిరితరులు నుడువీథి గడవంగ నొక్క పెల్లడరఁ, దక్కిన1635వారును దరుశైలతతులు నక్కజంబుగఁ1636బేర్చి యందంద వైవ వానిఁదుత్తుముఱుగా వడిఁగూలనేసి భానునందను నొక్క భయదభల్లమున వక్షంబు నొప్పింప వడఁకెఁబెన్గాలి వృక్షంబు చలియించు విధమున నతఁడు. నా లోన ఋషభు గవాక్షు సుషేణు వాలినందను జాంబవంతునిఁగుముదు మారుతసుతు గంధమాదను1637 నలుని వీరాదిగాఁగల వీరవానరుల వివశులఁగాఁ జేసి వివిధబాణంబు లవనీశుపై నేసి 1638హస్తలాఘవము విలసిల్ల లక్ష్మణువిలు ద్రెవ్వ నేసి యలుక విభీషణు నదరంట నేసి విలయకాలాంబుదవిధమునఁజెలఁగి పలుమాఱు 1639గర్జించి పలికె నెంతయును; “జూచితే రఘురామ! సుగ్రీవముఖ్యు లీ చందమునఁగూలి రే నల్గినపుడు; నరనాథతనయ! నిన్ నమ్మిన1640యట్టి బిరుదు వానర1641జాతి పీచంబు లడఁగె.” ననుచు వెండియుఁబేర్చి యన్నిశాచరుఁడు ఘనబాణతతుల నక్కపిసేనమీఁద నడరించె 1642ఘనభూధరాభదేహముల నెడలేక యుండ ననేక బాణముల. నటు లేసి“గెలిచితి.”నని యార్చికొనుచుఁ బటుగతి లంకలోపలి కేఁగి యంతఁ దన సంగరక్రియ దశకంఠుతోడ వినుతంబుగాఁజెప్ప విని1643 సంతసిల్లి: “తనయ!ర.”మ్మనుచుఁదద్దయుఁగౌఁగిలించి కొని:“నాకు నీయట్టి కొడుకుగల్గంగఁ బగవారిచే నాజిఁబడినబాంధవుల పగ నీఁగఁగాంచితిఁ; బాసె నా వగపు. కడిఁదివీరుఁడు కుంభకర్ణుండు మడిసె; నడఁగె మహాబలుండగు ప్రహస్తుండు; మృతిఁబొందెఁ ద్రిశిరుండు మేటి వీరుండు; హతుఁడయ్యె నతికాయుఁడాలంబులోన; నొగి మహాపార్శ్వమహోదరుల్వడిరి; తెగిరి నరాంతక దేవాంతకులును; గుంభకర్ణునిసుతుల్ఘోరవిక్రములు కుంభుండు వడియె; నికుంభుండు సమసె; మకరాక్షుఁడనిలోన మడిసెఁ దోడ్తోన; సకలనిశాచరసైన్యంబు వొలిసె; లంకఁగాల్చిరి కపుల్లావులు మెఱసి; యింక నేటికి మాట1644లివియెల్లఁదలఁచి! రయమునఁ జని నీవు రామలక్ష్మణుల భయదసాయక పరంపరలేసిచంపు. రణదక్షుఁడవు నీవు; రణములోఁదొల్లి తృణలీల గెలిచితి తివిఱి దేవేంద్రు; నీ వేచి నడచిన నిఖిలలోకములు భావింప నప్పుడె భస్మమై పోవు; నరు లెంతవారు; వానరు లెంతవారు పరికింప నీ!”కని పల్కి వీడ్కొలుప |