| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నెలమితోఁదన పురోహితునిఁదోడ్కొనుచు బొలుపార1645ఁగా రణభూమి కేతెంచి చెన్నొంద 1646యాగంబు సేయంగఁబూని యున్నంతఁబరిచరు లొగి వేగమునను బరగంగ1647నస్థి కపాలపాత్రికలు సొరిది నయోమయస్రుక్స్రువంబులును శస్త్రంబులును దాడి సమిధలు రక్త వస్త్రగంధాదులు వరుసఁదెచ్చుటయు రక్తవస్త్రంబులు రక్తమాల్యములు రక్త్తగంధంబును1648రయమొప్ప నతఁడు ధరియించి మారణతంత్రమార్గమునఁ బరువడిఁదోమర ప్రాస ఖడ్గములు సరిపరిధులు వెట్టి సప్రాణకృష్ణ హరిణంబుమెడఁగోసి యది పుచ్చుకొనుచు నక్తంచరాధీశ నందనుం డెలమి నుక్తక్రమంబున హోమంబు సేయఁ దనరిన ధూమప్రదక్షిణశిఖల ననలుండు వెలుఁగుచు హవ్యముల్ గొనఁగ జయనిమిత్తంబులు సాలఁగన్గొనుచు జయశాలి యా నిశాచరవీరుఁడలరి నియతి హోమముఁదీర్చి నిరుపమంబైన హయచతుష్టయముతో నతిఘోర1649లీల నురుతరబాణాసనోజ్జ్వ1650లంబగుచు సురుచిరాలంకారశోభి1651తంబగుచు సరినొప్పు సింహార్ధచంద్రచిహ్నములఁ బరగుచు వైడూర్యభాసురంబయిన పడగచే నొప్పుచు బ్రహ్మాస్త్రరక్ష నడరుచు నని నదృశ్యంబై చరించు నట్టి యా రథమెక్కి యనికి నేఁగుచును గట్టల్కఁబల్కె రాక్షసకోటి వినఁగ: “మీరెల్లఁజూడంగ మీఱి సంగ్రామ ధారుణిఁగూల్చి యా దశరథాత్మజులఁ బగ దీర్చి మా తండ్రిఁబంక్తికంధరుని విగతశోకునిఁజేసి విజయ మే నిత్తు. భానునందనుముఖప్లవగవల్లభుల నే నేఁడు సమయింతు నిమిషమాత్రమున. మఱియుఁ దక్కినయట్టి మర్కటోత్తముల నెఱయంగఁజంపుదు నేఁడాజిలోనఁ దెగువతో.”ననుచు నదృశ్యుఁడై 1652యచట నొగి రాక్షసుల నేయుచున్న రాఘవులఁ బొడగని భీకరభ్రుకుటియై విల్లు వడి నెక్కువెట్టి దుర్వారవేగమునఁ బ్రళయకాలమునాఁడు బలువృష్టిగురియు జలదంబువిధమున శరవృష్టి గురిసె. గగనంబు నిండ నా ఘనులు రాఘవులు నొగి నేసి రలుకతో నుగ్రబాణముల. నమరారి యవిద్రుంచి యమ్ములసోనఁ దిమిరంబు1653నిండించె దిక్కులం.దపుడు పృథుచండకోదండభీకరధ్వనియు రథనేమిరవమును రథతురంగముల ఖురములమ్రోఁతయు గుణమునిస్స్వనము నరుదారఁ జరియించు నతనిరూపంబు వినఁ గానఁ బడకున్న విస్మయంబంది ఘనవీథిఁ బరికింపఁ గ్రమ్మఱ నాతఁ డఖిలాంబకమ్ముల నా రాజసుతుల నిఖిలాంగకంబులు నిండ నేయుటయు నా ఖరకరకులుం డా రాఘవేంద్రుఁ డా ఖరసూదనుం డపుడు కోపించి వాఁడేయుమార్గణావళు1654లెందు వచ్చు వాఁడిభల్ల1655ములందు వడి నేసి యేసి యా బాణజాలంబు లందంద 1656తునుమ నా బాహుబలశాలి యగు నింద్రజిత్తు బహు1657విధంబులఁదేరు పఱపుచు నేసె బహుశరంబుల; నంతఁబార్థివసుతులు కమియఁబూచిన కింశుకంబులతోడి సమత నొప్పిరి శరక్షతయుతాంగములఁ గర ముగ్రమైనట్టి కాలమేఘంబు కరణి నొప్పిన తన ఘనశరీరంబు తెలియకుండఁగ యామ్యదిక్కుననుండి పలికె నయ్యింద్రారి పార్థివోత్తముల: “నెక్కడ పోయెద? రెందు డాఁగెదరు? చిక్కితి1658రిట; మిమ్ముఁజేరి కావంగ దిక్కెవ్వ రిటమీఁద? దివిజు లటన్నఁ జుక్కవా లీ వంకఁజూడ నోడుదురు. బక్క క్రోఁతుల1659ఁగూడి బవరంబునకును మొక్కలమ్మున వచ్చి మోసపోయితిరి. పటుతరంబైన నా బాణాగ్నిశిఖలఁ బెటపెట ప్రేలక ప్రిదిలిపోఁగలరె? యా విభీషణునివాక్యములె నిక్కువము గా విని నా శక్తిఁగానలేరైతి; రిదె మిమ్ముఁదెగటార్చి యేచి యీ ప్రొద్దె కదలి యయోధ్యలోఁగలవారినెల్లఁ బరిమార్చి మించి యా భరతశత్రుఘ్ను లిరువురఁదెగటార్చి యేతెంతు.”ననఁగఁ గడు వెఱగందిరి కపులు నాకపులు. నడరుకోపంబున నా యింద్రజిత్తు పడుమటఁదన పేరు పంతంబులాడుఁ; దడయ కుదీచిని ధనువు మ్రోయించు; ధీరుఁడై యట దూర్పుదిక్కున నుండి ఘోరంపుశరవృష్టి గురియించు మించి; దక్షిణంబున కేఁగి ధరణి గ్రక్కదల నక్షీణశక్తిమై నడరి పెల్లార్చు. నిబ్భంగిఁ1660దిరిగి యనేక మార్గముల నబ్భానుజాదులు నరుదంది చూడ శరములు వింటితో సంధించికొనుచుఁ బరువడి వాఁడేయు బాణజాలములు జనపతుల్ ద్రుంతురు చటులాంబకముల ననిమిషు1661లాశ్చర్యమంది వీక్షింప. నప్పుడు శతసంఖ్యలతనిచేఁ గపులు కుప్ప1662లు కుప్పలై కూలుట చూచి సౌమిత్రి కోపించి జనపతి కనియె: “భూమీశ! వీనిచేఁ బొలిసిరి కపులు. ఇదియేమి దేవ! నీ విట్లూరకునికి! యిదె చూడుమా భువి నెల్లదిక్కులను బడి పొర్లుచున్నారు భల్లూకపతులు; మడిసి రనేకులు మర్కటేశ్వరులు. జగతీశ! నిను నమ్మి సకలవానరులు మిగిలిన భక్తితో మేకొని వచ్చి తగిలి యీ యింద్రారిదారుణాస్త్రముల నొగిలి నీ నామమె నుడువుచున్నారు. పగవాడు చేరి నీ బలమెల్లఁజంపెఁ; దగ దింకఁదెగ1663కున్నఁ ద్రైలోక్యనాథ! పగ దెగ నలుగు నీ బాణజాలములు గగనంబు దిక్కులు గలయంగ నిండి నిండిన భక్తితో నిజదివ్యతనువు లొండొండ ధరియిం1664చియున్నవి వానిఁ. గై1665కొని రిపుఁజంపు కమలాప్తవంశ! నీ కెదురై పోర నేర్తురే రిపులు. ఇంత శాంతము1666గలదే నృపులకును? జింతింప1667నేల విచిత్రంబుగాఁగఁ? బరగిన నీ బాహుబలపరాక్రమముఁ దరుణార్కసమతేజ! తలపోయ 1668వకట! పరమేశ! నాయట్టిబంటు నీ సేవ చిరభక్తిమైఁ జేయఁజింత నీ కేల? యీ నిశాచర1669కీట మీ యింద్రజిత్తు నేన చంపెద దేవ! నీ మహత్త్వమున. నిటమీఁద బ్రహ్మాస్త్ర మేఁ బ్రయోగించి 1670కుటిలరాక్షసకోటికులమెల్ల నడఁతు.” ననవుడు రఘురాముఁడనుజున కనియె: “వినుము; లక్ష్మణ! యొక్క వీనికై పూని చనునె పల్వురఁజంప? సంగ్రామమునకుఁ జనుదేని వారల సమయింపఁదగునె? యనిమిష1671దనుజరుద్రాదులచేత ననిఁజావఁడితఁడని యబ్జజుండిడిన వరముఁజెల్లింపంగవలసి యే వీని నిరవందఁగాచితి; నిఁక నుండెనేని వీనిఁజంపఁగజాలు వీరవానరుల నేన పంపెద; 1672వారె హింసింతు రితని. నటుకాక తక్కిన నమ్మేఘనాదుఁ డట యింద్రలోకంబునందు డాఁగినను, నట1673బ్రహ్మలోకంబునందు డాఁగినను, నట1674రుద్రలోకంబునందు డాఁగినను, ధరణి దూరిన, రసాతలము సొచ్చినను, శరధిలో మునిఁగిన, జముఁడు గాచినను, దన తాతయగు ధాత తన వెన్కఁబెట్టు కొనిన నేఁబోనీక ఘోరాజిఁద్రుంతు.” నని పల్క రఘురామునలుక వాఁడెఱిఁగి యని సేయ నొల్లక యా లంకఁజొచ్చి ఘోరనిశాచర కోటితోఁ బోయి యా రావణునితోడ ననె నింద్రజిత్తు: “కట్టల్కఁగపులను గయ్యంబునందు నెట్టన నేసితి నేలపైఁగూల; మనుజుల నిద్దఱ మానముల్ గొంటి.” ననవుడు రావణుండతనిఁ గోపించి “యిది యేమిపోక నీ; విది యేమిరాక యిది యేమిసేఁతగా నెన్ని చెప్పెదవు? ఒకపరియును జంప కూరక వచ్చి ప్రకటించె“దందఱుఁబడి”రని నీవు. నీ వేచి నడచిన నిఖిలలోకములు భావింప నప్పుడె భస్మమై పోవు. నది1675గాన యిది యొక్క యధిక మటంచు 1676మదిఁదలంపకుము సమ్మదమున నీవు మగఁటిమి రామలక్ష్మణుల వానరులఁ దెగటార్చికాని నా దెస కేఁగుదేకు.” మనవుడు“నౌఁగాక!”యని యింద్రజిత్తు దనుజేంద్రు వీడ్కొని తన మదిలోన: “నతికాయ కుంభకర్ణాది దైతేయ పతులెల్ల మడిసి రిబ్భంగి నుగ్రాజిఁ; గాన యా రామలక్ష్మణుల నే రీతి నైనను గెల్చెద.”నని నిశ్చయించి, |