| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
సీతచందంబుగాఁ జెలువొంద నొక్క నాతిని దన మాయ నాకీశవైరి[వా.రా. సర్గ 81] యట సేసి ప్రీతి మాయాసీతఁగొనుచు బటుబలసహితుఁడై పడుమట వెడలె. వానికిఁగాక యా వానరులెల్ల నానా విధంబుల నలికి పాఱుటయు హనుమంతుఁడపుడు మహాశైలశృంగ మనువారఁగాఁబట్టి యసుర మార్కొనఁగ నరుదార వచ్చుచో నయ్యింద్రజిత్తు నరదంబుమీఁద మాయాసీతఁగనియె: వెక్కసంబుగ రామవిరహానలంబు నిక్కిన నాహారనిద్రలు దొఱఁగి కడలేనివగ1677నున్నగతి గానఁబడఁగ వెడలు నిట్టూర్పుల వెలవెలఁబాఱి కడుఁగృశంబగు మేనుఁగమలపత్రముల నొడుచులోచనముల నొలుకుబాష్పములు జడగట్టి సీమంతసరణిఁజిక్కొదవి యడగొని మలినంబులగు శిరోజములు ధరణిరజోలిప్తతనుతరాంగములుఁ గరము విన్ననిమోముఁగర 1678పల్లవంబుఁ గదిసినచెక్కునై గాలిచేఁజాలఁ గదలెడు లతవోలెఁ గంపించుచున్న యా మహీసుతఁజూచి:“యకట! వీఁడింక నేమిసేయునొ రామహృదయవల్లభను! నీ దీనదశ నాకు నీక్షింప వలసె హా దైవమా!”యని హనుమంతుఁ1679డడరి ఘోరవానరవీరకోటితోఁగూడి దారుణాకృతిఁబేర్చి తనమీఁద ననికి నడచుచో నా వాయునందనుఁజూచి కడుఁగ్రూరుఁడై దశకంఠనందనుఁడు “నిది యేల వచ్చెద వీ సేనతోడ? నిదె చూడరా! సీత;యీ సీతకొఱకు నలజడిఁబడియెద; రటుకాన దీనిఁ దలఁద్రెవ్వ నేసెదఁదవిలి యే.”ననుచు గలఁగి శార్దూలంబుకడ నున్న హరిణి పొలుపున నయనాంబుపూర1680ంబు లొలుక “హారామ! హారామ!”యను నార్తరవము లారంగఁజేయు మాయాసీత నొడిసి తలవెండ్రుకలు వట్టి దట్టించి యీడ్వ నలిగి యా దైత్యుతో ననియె వాయుజుఁడు: “తగునె దురాత్మక! దనుజుండవైన నగుదువుగా కేమి? యా విశ్రవసుని మనుమఁడ; విబ్భంగి మనుకులేశ్వరుని వనిత ముందలఁబట్టి వారక యీడ్వ!” ననవుడుఁగరవాల మంకించి యసుర తనరు మాయాసీత తలఁద్రెవ్వ నేసి: “చనుమింక రామలక్ష్మణులకుఁజెప్ప.” నన ఖిన్నుఁడైయుండె ననిలనందనుఁడు వసుధాతలంబున వడి నెత్తురొలుక నసిధారఁదెగిన మాయాసీతఁజూపి హనుమంతుతోడ నిట్లనె నింద్రజిత్తు: “వనచరోత్తమ! రామువనిత నీ సీత, ఘనతరంబైన నా కరవాల1681మునను దునిమితి; మీ రణోద్యోగంబు 1682లింకఁ జిక్కెఁబొ.”మ్మంచు విజృంభించి పలికి దిక్కుంభికర్ణముల్ దిశలును బగుల సంహారఘనఘన స్తనితమో యనఁగ సింహనాదముసేయఁజిత్తముల్ గలఁగ నప్పుడు రణములో నా యింద్రజిత్తుఁ దప్పక కనుఁగొని తనరినభీతి[వా.రా. సర్గ 82] వనచరుల్ వాఱంగ వాయునందనుఁడు కనుఁగొని పలికె:“నో కపివీరులార! సమయవిక్రమములు సాలించి పాఱ సమయమే? యెఱుఁగరే సమరధర్మంబు? తలఁప బంధులకెల్లఁ దలవంపుగాఁగఁ గలనఁబారుట 1683గడుఁగష్టంబు గాదె? నడచెద నే మున్ను; ననుఁగూడి మీరు కడిమి వాటింతురుగా.”కంచుఁబలుక నందఱుఁదరువులు నచలశృంగములు నందంద కైకొని హనుమంతుఁగూడి రయమున నార్చుచు రాక్షససేన పయివైచి.1684రెంతయుఁబవమానసుతుఁడుఁ జలమున నొక మహాశైల మంకించి యలుకతో వైవంగ నా నిశాచరుని సారథి రథ మౌలఁజనఁదోల నదియు దారుణధ్వనితోడ ధరఁగ్రుంగఁబడియె. నా లోన వెండియు నగచరుల్ దరులు శైలశృంగములు రాక్షసులపై వైవఁ దన సేన విఱిగిన దశకంఠసుతుఁడుఁ గనుఁగొని కోపించి కపియూధపతులఁ బటుశూల ముద్గర ప్రాస ఖడ్గములఁ జటుల వేగంబున సమయించె. నపుడు మారుతాత్మజుఁడును మదిలోనఁగినిసి ఘోరవిక్రమకళాకుశలుఁడై పేర్చి కడిమిమైఁగవియు రాక్షసుల రూపడఁ1685చి వడి శిలాతరుఘోరవర్షముల్ గురిసి యా నిశాచరసేన నవలీలఁదోలి వానరావలిఁజూచి వాయునందనుఁడు: “వనచరపతులార! వసుధేశుదేవి దనుజాధముఁడు సంపెఁ; దప్పెఁగార్యంబు. సమర మేటికి నింక? జనకజవార్త కమలాప్తకులున కొక్కట నెఱింగింప నరిగెద; నటమీఁద నా రాముఁ1686డెద్ది వెరవాన1687తిచ్చు నా విధము సేయుదము. మీరందఱును సంభ్రమింపక యుండుఁ డీ రాక్షసుఁడు క్రూరుఁడేమఱవలవ.” దని యటు మగుడిన హనుమంతుఁజూచి 1688తన మది నప్పుడు దశకంఠసుతుఁడు |